YCP MLA: కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి నిరసన సెగ

ABN , First Publish Date - 2023-01-12T18:50:50+05:30 IST

కడప జిల్లా (Kadapa district)లో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి (YCP MLA Raghurami Reddy)కి నిరసన సెగ తగిలింది.

 YCP MLA: కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి నిరసన సెగ

కడప: కడప జిల్లా (Kadapa district)లో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి (YCP MLA Raghurami Reddy)కి నిరసన సెగ తగిలింది. నర్శిరెడ్డిపల్లెలో 'గడపగడప'లో పాల్గొనడానికి వెళ్లిన రఘురామిరెడ్డికి గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి వైసీపీ (YCP) శ్రేణులు నిరసన తెలిపారు. చేసేదేమీ లేక గ్రామం నుంచి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెనుతిరిగారు. నర్శిరెడ్డిపల్లెలోకి రోడ్డువేస్తామన్న హామీని ఎమ్మెల్యే అమలుచేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముఖంపైనే ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్తులు నిరసన తెలిపారు.

Updated Date - 2023-01-12T18:51:31+05:30 IST