Chandrababu ACB Court: భోజన విరామం తర్వాత వాదనలు ప్రారంభం.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ABN , First Publish Date - 2023-09-10T14:21:10+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరోసారి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉదయం నుంచీ భోజన విరామం వరకూ ఇరు వర్గాలు వాదనలు
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) మరోసారి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉదయం నుంచీ భోజన విరామం వరకూ ఇరు వర్గాలు వాదనలు వినిపించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం వాదనలు వినిపించగా... చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. ఇక భోజన విరామం తర్వాత మరొకసారి వాదనలు వినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు లోపలా? బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు తీర్పుపై టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాగే బెయిల్ రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. కోర్టు దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఈ పరిణామాలతో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ చోటుచేసుకుంది.
చంద్రబాబు తరఫున లాయర్ లూథ్రా వాదనలు ఇలా..
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించారు. ‘‘స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదన్న కోర్టు. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామన్న అదనపు ఏజీ. 2021లో కేసు పెడితే ఇప్పటివరకూ ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయలేదన్న కోర్టు. 409 సెక్షన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించింది అన్న లూథ్రా, శుక్రవారం ఉ. 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ప్రస్తావించిన లూథ్రా. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలి. గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదు.’’ అని సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు.