Minister Roja: చంద్రబాబును రోజా ఎంతమాట అనేశారో చూడండి...

ABN , First Publish Date - 2023-04-28T14:41:03+05:30 IST

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

Minister Roja: చంద్రబాబును రోజా ఎంతమాట అనేశారో చూడండి...

కృష్ణా: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై మంత్రి రోజా (Minister Roja) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) అని.. అటువంటి చంద్రబాబు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుండటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ (NTR) పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు (TDP Chief) డ్రామాలు ఆడుతున్నాన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ మీద నిజంగా ప్రేమ ఉంటే 14 యేళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబం గుర్తు కొస్తుందని విమర్శించారు. తడిగుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. భార్యని చూసుకోలేనోడు దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని మోడీని తిట్టారని.. రాహుల్ గాంధీతో చేతులు కలిపి మోడీని గద్దె దించుతానన్నారని.. ఇప్పుడేమో జాతీయ మీడియాతో మోడీ విజన్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఇది చంద్రబాబు నైజం అంటూ మంత్రి రోజా మండిపడ్డారు.

Updated Date - 2023-04-28T14:41:03+05:30 IST