Amaravati: రైతుబరోసా వాయిదా వేసిన సీఎం జగన్

ABN , First Publish Date - 2023-08-31T11:24:05+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుబరోసా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గురువారం కౌలు రైతులకు రైతు భరోసా అని సీఎం జగన్ ప్రకటించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నగదు జమ చేస్తామని అన్నారు.

Amaravati: రైతుబరోసా వాయిదా వేసిన సీఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రైతు బరోసా (Rythu Barosa) కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గురువారం కౌలు రైతులకు రైతు భరోసా అని సీఎం జగన్ (CM Jagan) ప్రకటించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం (CM Camp Office) నుంచి బటన్‌ నొక్కి నగదు జమ చేస్తామని అన్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వ సాయం అందిస్తామంటూ ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతు భరోసా డబ్బులు వస్తాయని కౌలు రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా.. ఆఖరు నిముషంలో రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా నిధులు సమకూరకపోవడంతో కార్యక్రమం వాయిదా వేసినట్టు సమాచారం. నెలాఖరు కావడంతో జీతాలు, బరోసా కార్యక్రమం పెట్టుకోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి రైతు భరోసా కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Updated Date - 2023-08-31T11:24:05+05:30 IST