Yanamala: రాజపక్సేలా నువ్వూ పరారవడం తథ్యం.. జగన్‌పై విసుర్లు
ABN , First Publish Date - 2023-02-18T12:29:15+05:30 IST
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (TDP politburo member Yanamala Ramakrishnudu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ (AP CM) నిరంకుశ విధానాలు రాష్ట్రంలో సివిల్ వార్‌కు దారితీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు సివిల్ వార్ గాని వస్తే దానికి జగన్ రెడ్డే (Jagan Reddy) ప్రధాన కారకుడన్నారు. జగన్ రెడ్డి (AP CM)దుశ్చర్యలకు పోలీసుల వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీసులిలా చేయడం దారుణమన్నారు. చంద్రబాబు (Chandrababu Naidu) జిల్లా పర్యటన రెండు రోజులు ప్రశాంతంగా జరిగిందని.. ఈ రెండు రోజుల్లో ఎక్కడా ఉద్రిక్తత తలెత్తలేదని తెలిపారు. మరి మూడవరోజు అనపర్తిలో ఎందుకిలా దురాగతానికి పాల్పడ్డారని ప్రశ్నించారు. అక్కడో చట్టం, ఇక్కడో చట్టమా..? అక్కడ ప్రశాంతంగా జరిగితే, ఇక్కడ ఉద్రిక్తత వస్తుందా అంటూ నిలదీశారు. జగన్ డైరెక్షన్ (Jagan Direction)లో పోలీస్ యాక్షన్ అని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పోలీసులే చెరబట్టడమా అని టీడీపీ నేత (TDP Leader)మండిపడ్డారు.
ఏపీలో కూడా అదే రిపీట్ అవుద్ది....
ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులని... రక్షించాల్సిన వాళ్లే కబళిస్తే ప్రజలే ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని తెలిపారు. నిన్న అనపర్తి (Anaparthy)లో అదే జరిగిందన్నారు. ప్రజలే రక్షకభటుల్లా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారన్నారు. సివిల్ వార్‌లు, తిరుగుబాట్లు కొత్తేమీ కాదని.. ప్రపంచంలో అనేకచోట్ల వచ్చాయని తెలిపారు. అణిచివేత పెరిగితే ప్రజలే తిరగబడతారని.... శ్రీలంక (Sri Lanka), ఉగాండా (Uganda), ఈజిప్టు (Egypt) ఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. శ్రీలంకలో ప్రజలు తిరగబడితే దేశాధినేతే పారిపోయాడన్నారు. ఉగాండాలో కూడా అదే జరిగిందని... ఈజిప్ట్ లో తిరుగుబాటు తెలిసిందే అని అన్నారు. ఇప్పుడదే ఏపీలో కూడా రిపీట్ అవుతుందని... జరిగే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు (TDP Chief) పర్యటనకు పర్మిషన్ ఇచ్చి, క్యాన్సిల్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కారణాలేవైనా ఉంటే క్యాన్సిల్ చేశారంటే అర్ధం ఉంటుందని... రెండు రోజులు ప్రశాంతంగా జరిగిన పర్యటనను మూడోరోజెలా క్యాన్సిల్ చేస్తారని మండిపడ్డారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన వాళ్లే దానిని భగ్నం చేయడం ఏమిటని అడిగారు. భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని.. సమావేశమయ్యే హక్కు రాజ్యాంగమే ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తన భావాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకే పోలీసులుందని.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసేందుకు కాదన్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించామని భావిస్తే ఈసీ (ED)కి ఫిర్యాదు చేయాలన్నారు. అంతే తప్ప ఇలాంటి దుందుడుకు చర్యలకు పోలీసులే పాల్పడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉల్లంఘనలన్నీ ప్రభుత్వమే చేస్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమేంటని అడిగారు. ఎస్సీ నాయకుడు, మాజీమంత్రి జవహర్ (Former Minister Jawhar)ను స్టేషన్‌లో కింద కూర్చోపెట్టడంపై మండిపడ్డారు. దళితులు కిందే కూర్చోవాలనేది జగన్ ఫిలాసఫీనా అని ప్రశ్నించారు. జగన్ ఫాసిస్ట్ ఫిలాసఫీని పోలీసులు అమలు చేస్తున్నారా అంటూ నిలదీశారు.
ఆయనకేమైనా జరిగితే ఎవరిది బాధ్యత....
‘‘పోలీసులేంటి, రోడ్డుకు అడ్డంగా కూర్చోడమేంటి..? రోడ్డుకు అడ్డంగా పోలీసులే బైఠాయించడం ఎక్కడైనా ఉందా, చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా..?’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘జగన్ రెడ్డి చెబితే బస్సులు అడ్డం పెడతారా..?. జగన్ రెడ్డి చెబితే రోడ్డుకు అడ్డంగా కూర్చుంటారా..?. ఇదేమి పోలీసింగ్..? ఇలాంటి పోలీసింగ్ ఏ రాష్ట్రంలోనైనా ఉందా..?. ఒక జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి దుష్ప్రవర్తనకు పోలీసులే పాల్పడితే ఏమనాలి. అంటే కేంద్ర పోలీసు భద్రతను, రాష్ట్ర పోలీసు భగ్నం చేస్తుందా..?. 7 కిలో మీటర్లు కాలినడకన వెళ్లే దుస్థితి కల్పిస్తారా..?. ఆ చీకట్లో, ఆ గుంతల్లో ఆయనకేమైనా జరిగితే ఎవరిది బాధ్యత..?. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన జాతీయ నాయకుడి పట్ల అనుసరించాల్సిన పద్ధతి ఇదేనా..?. ఇది పద్ధతి కాదు జగన్ రెడ్డీ.. దీనికింతకింత మూల్యం చెల్లించక తప్పదు’’ అంటూ హెచ్చరించారు.
‘‘ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఎదుర్కోవడం నీతరం కాదు కదా, నీ తాత దిగొచ్చినా సాధ్యం కాదన్నారు. శ్రీలంక, ఉగాండా, ఈజిప్ట్ ఘటనలే ఇక్కడే పునరావృతం అవుతాయని.. రాజపక్సేలా నువ్వూ పరారు కావడం తథ్యం’’ అంటూ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు.