Tulsi Reddy: రాహుల్ తీర్పు మోడీ,అమిత్ షా లకు చెంపపెట్టు
ABN, First Publish Date - 2023-08-05T17:44:00+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులు ఆహ్వానిస్తున్నామని.. ఇది ప్రధాని నరేంద్రమోదీ((pm modi), హోంమంత్రి అమిత్‌షా(Home Minister Amit Shah)లకు చెంపపెట్టు వంటిదని ఏపీసీసీ నేత తులసిరెడ్డి(Tulsi Reddy) అన్నారు.
విజయవాడ(Vijayawada): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులు ఆహ్వానిస్తున్నామని.. ఇది ప్రధాని నరేంద్రమోదీ((pm modi), హోంమంత్రి అమిత్‌షా(Home Minister Amit Shah)లకు చెంపపెట్టు వంటిదని ఏపీసీసీ నేత తులసిరెడ్డి(Tulsi Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రబుత్వం(central govt) ఇప్పటికైనా కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని హితవు పలికారు. ఎంత వేగంగా లోక్‌సభ(
Lok Sabha) సభ్యత్వాన్ని రద్దు చేశారో అంతేవేగంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకోవాలనే కుట్రతో చేసిన చర్యలకు అడ్డుకట్ట పడిందన్నారు. నిన్న తెలుగుదేశం(Telugu Desham) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) యాత్రను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు(YCP leaders) అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు.ఇది పూర్తిగా పోలీనుల వైఫల్యంలా ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది పోలీస్‌లేనని చెప్పారు.దెబ్బలు తగిలాయని సానుభూతి చూపాలనుకోవడం వైసీపీ నేతలకు సరికాదన్నారు.ప్రపంచ నియంతలే కాలగర్భంలో కలిసి పోయారని... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి కాంగ్రెస్(Congress) సూచిస్తుందన్నారు.ఇటీవల వరద భీభత్సం సృష్టించిందని ఈ వరదల్లో ఎంతోమంది నిరాశ్రయిలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం(Jagan Govt) అట్టర్ ప్లాప్ అయిందన్నారు.కనీసం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్(cm jgan)పర్యటించకుండా బాధితులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నాయకులు కూడా కనీసం బాధితులను పట్టించుకోలేదన్నారు. బీజేపీ(BJP) రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మూడు పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. మణిపూర్(Manipur) ఘటనపై ఇండియా కూటమి అవిశ్వాసం పెడితే రాష్ట్రానికి శనిగ్రహంలా బీజేపీ ఉంటే, రాహు కేతువుల్లా రాష్ట్రంలోని పార్టీలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా ఆ పార్టీల స్వభావాన్ని అర్ధం చేసుకుని చిత్తు చిత్తుగా ఓడించాలని తులసిరెడ్డి హితవు పలికారు.
Updated Date - 2023-08-05T17:44:22+05:30 IST