Vijayawada: ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రోత్సవాలు..

ABN , First Publish Date - 2023-03-21T15:56:59+05:30 IST

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

 Vijayawada: ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రోత్సవాలు..

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి (Indrakiladri) కనకదుర్గ (Kanakadurga) అమ్మవారి ఆలయం (Temple)లో మంగళవారం ఉగాది సందర్భంగా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుభకృత నామసంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని రేపటి నుంచి 31వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవములు (Vasantha Navratri festivals) జరుగుతాయి.

వసంత నవరాత్రోత్సవముల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చణములు, అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము 3 గంటలకు సుప్రభాత సేవ.. అనంతరం అమ్మవారి అంతరాలయం, ఉపాలయాల్లోని దేవతా మూర్తులకు స్నపనాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఉదయం 9 గంటలకు అమ్మవారి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు రధోత్సవం జరుగుతుంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-21T15:56:59+05:30 IST