Kodalinani: ఇక్కడకు రండి.. మీ సంగతి తేలుస్తా... చంద్రబాబు, లోకేష్‌కు కొడాలినాని సవాల్
ABN, First Publish Date - 2023-02-17T15:30:15+05:30
టీడీపీ నేత లోకేష్ మూడు వారాలుగా పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.
అమరావతి: టీడీపీ నేత లోకేష్ (TDP Leader Nara Lokesh) మూడు వారాలుగా పాదయాత్ర (YuvaGalam Padayatra) చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు(TDP Chief) ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలోనే పుట్టావా అని సీఎం జగన్‌ను లోకేష్ (LokeshYuvaGalam) అడుగుతున్నారని... లోకేష్ ఎక్కడ పుట్టాడని తాము అడిగితే సోషల్ మీడియాలో తమపై పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారన్నారు. సీఎం జగన్ (AP CM) రాయలసీమలోనే పుట్టి పెరిగారని... నారా లోకేష్ తెలంగాణ (Telangana) లో పుట్టి పెరిగారని తెలిపారు. లోకేష్ తెలంగాణలో పుట్టి, పెరిగి ఏపీ (Andhrapradesh) లోకి ఎందుకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ డీఎన్‌ఏ గురించి ప్రశ్నిస్తున్నారని.. ముందు లోకేష్ డీఎన్‌ఎ గురించి చెప్పాలని ఆయన అన్నారు.
భారతమ్మ పేరే ఎత్తితే...
చంద్రబాబు (TDP) 13 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి దరిద్రం పట్టించారని విమర్శించారు. చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తన్నారు. అవినీతి డబ్బును హెరిటేజ్ (Heritage) పెట్టి చంద్రబాబు కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. జగన్‌ను సైకో అంటోన్న చంద్రబాబే ఓ పెద్ద సైకో అన్నారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఆయన మామ ఎన్టీఆర్ (NTR) చెప్పారని తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) గురించి వ్యక్తిగతంగా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తన అమ్మను ఏదో అవమానించారని లోకేష్ అంటున్నారని.. కానీ చంద్రబాబే తన భార్యను అల్లరి చేశారన్నారు. కావాలంటే అసెంబ్లీ రికార్డును పరిశీలించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. లోకేష్ వాళ్ల అమ్మ మాత్రమే ఆడదా.. భారతి (YS Bharati) కాదా అని నిలదీశారు. ‘‘చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలి. నా నియోజకవర్గానికి రా...నువ్వో నేనో తేల్చుకుందాం.. నన్ను లేదా వంశీనో టచ్ చేసి చూడు... మీ సంగతి తేల్చుదాం... నేను దేనికైనా సిద్దం’’ అంటూ సవాల్ విసిరారు. భారతమ్మ పేరు ఎత్తితే వారి సంగతి చెబుతానని హెచ్చరించారు. జగన్ వదిలేసినా తాము వదలే ప్రసక్తి లేదనని కొడాలి నాని (YCP MLA)వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-02-17T15:30:16+05:30 IST