చంద్రబాబు కోసం పూజలు
ABN , First Publish Date - 2023-10-10T23:43:00+05:30 IST
కుట్ర రాజకీయాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నాయకులు అన్నారు.

కుట్ర రాజకీయాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నాయకులు అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంగళవారం దీక్షలు కొనసాగించారు. అలాగే చంద్రబాబు క్షేమంగా ఉండాలని, జైలు నుంచి విడుదల కావాలని ఆలయాల్లో పూజలు, చర్చీలు, దర్గాల్లో ప్రార్థనలు చేశారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని సీఎం జగన్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 10: గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో మహిళలు పశ్చాత్తాప పడుతున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఉదయం ఆళ్లగడ్డలో నిరాహార దీక్షలో పాల్గొని, సాయంత్రం మండలంలోని మర్రిపల్లె గ్రామంలో ఆమె ఇంటింటికి వెళ్లి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనకు మనమంతా అండగా నిలవాలని కోరుతూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు మహిళల కోసం చేపట్టిన పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకొని సీఎంగా చూసుకోవాలన్న ఆకాంక్ష ప్రజల్లో దినదినానికి పెరుగుతోందన్నారు. ఆళ్లగడ్డ కౌన్సిలర్ హుసేన్‌బాషా, మర్రిపల్లె నాయకుడు పాపిరెడ్డి, యాదవాడ నాయకులు నరసింహుడు, వెంకటరామిరెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామికి టీడీపీ నాయకులు మంగళవారం పూజలు చేశారు. పార్టీ కర్నూలు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గూడూరు సంజీవరాయుడు, ఎస్‌ఎల్ రమణ, మాజీ సర్పంచు వీరభద్రుడు, గంగాధర్ ఉన్నారు.
చాగలమర్రి: టీడీపీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసి కట్టుగా పని చేద్దామని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం చాగలమర్రి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అరెస్టుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జైలు నుంచి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు మౌళాలి, మాబులాల్, అనీఫ్, మదార్‌సా, అజిమ్, గఫార్, ఉసేన్‌పీరా, రమేష్, మహబూబ్‌బాషా, గాంధీ, వలి, బషీర్ పాల్గొన్నారు.
శిరివెళ్ల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నిర్దోషిగా తిరిగి రావాలని మండలంలోని గోవిందపల్లె సీఎస్‌ఐ చర్చిలో, శిరివెళ్ల ఆర్‌సీఎం చర్చిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టీడీపీ నాయకులు గంగదాసరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మిరెడ్డి, రవిచంద్రారెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డి, కుమార్, జోషఫ్, రాజు, జోజిబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
డోన్: టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు వచ్చేవరకు పోరాటం ఆగదని ఆ పార్టీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో పెద్దపూదిళ్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కూర్చున్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన సీఎం జగన్ కుట్ర రాజకీయాలతో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, శ్రీనివాసులు యాదవ్, గండి కోట రామసుబ్బయ్య, లక్ష్మీనారాయణ యాదవ్, అభిరెడ్డిపల్లె గోవిందు, గడ్డం ప్రసాద్‌రెడ్డి, రంగారెడ్డి, కాంతారెడ్డి, రామాంజినేయులు చౌదరి, ఎస్టీ హరూన్, గోవిందరెడ్డి, మిద్దెపల్లి గోవిందు, కుమ్మరి సుధాకర్ పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిందని టీడీపీ పట్టణ అధ్యక్షులు సీయం శ్రీనివాసులు, నాయకులు ధర్మవరం పెద్దనాగిరెడ్డి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని 81, 84, 85 పోలింగ్ కేంద్రాల పరిధిలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు ప్రభాకర్, నాగేంద్ర, దస్తగిరి, జలదుర్గం విష్ణు, మధుసూదన్‌రెడ్డి, రామాంజినేయులు పాల్గొన్నారు.
బేతంచెర్ల: చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ పట్టణంలోని శ్రీనగర్‌కాలనీలో ఉన్న జెరుసలేం చర్చిలో ఫాదర్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య, షేక్షావలి చౌదరి, తిరుమలేష్ చౌదరి, రామగోపాల్, రామాంజినేయులు, రవీంద్ర నాయక్, నాగరాజు, రూబేన్, మధు, రామ్మూర్తి, వంశీకృష్ణ, ఫయాజ్, అంజాద్, వెంకటేశ్వర్లు, నారాయణస్వామి, అంజి, శివ, పాల్గొన్నారు.
ప్యాపిలి: టీడీపీ అధినేత చంద్రబాబు కోసం మంగళవారం ప్యాపిలి మధ్యగేరి ఆంజినేయస్వామి ఆలయంలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. నాయకులు రామ్మోహన్‌యాదవ్, చిన్నసుంకయ్య, మధుకుమార్, చల్లా వీరాంజినేయులు, రంగన్న, గండికోట పెద్దరామాంజి నేయులు తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె: టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా జైలునుంచి విడుదల కావాలని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ ఆధ్వర్యంలో మంగళవారం నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గాలిగోపురం ముందర ప్రతి మెట్టుకు కొబ్బరికాయలు కొట్టారు. బీసీ ఇందిరమ్మతో పాటు మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పీవీ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆర్చకులు బీసీ ఇందిరమ్మ, టీడీపీ నాయకులకు శాలువాలు, పూలమాల లతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. బనగానపల్లె మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి, వెంగన్న, చంద్రమౌళీశ్వరరెడ్డి, ఫక్కీర్‌రెడ్డి, మీరాపురం భాస్కర్‌రెడ్డి, మదన్‌భూపాల్ రెడ్డి, వల్లెపుశంకర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
బనగానపల్లె పట్టణంలోని పాతబస్టాండులోని బీసీ గుర్రెడ్డి కాంప్లెక్స్‌లోని దర్గా వద్ద బీసీ ఇందిరమ్మ, ఆధ్వర్యంలో ముస్లింలు మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు బాజీ చౌదరి, టీడీపీ ముస్లింలు అన్వర్ సాహెబ్, అమీర్ జాన్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాశీంబాబు, అహమ్మద్‌హుసేన్, ఇస్మాయిల్ ఖాన్, గౌండాబాబు, సలాం, ఖాదర్ పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: చంద్రబాబు నిర్దోషిగా విడుదల కావాలని కొలిమిగుండ్ల బేతనియ ప్రార్థన మందిరంలోట టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు కోటపాడు శివరామిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మంద విజయకుమార్, టైలర్ వెంకట్రాముడు, అంజి, పోతుల శేఖర్, అహమ్మద్, రామకృష్ణ యాదవ్, వెంకటేష్, గోపాల్ పాల్గొన్నారు.