Nara Lokesh : చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వ యత్నం
ABN , First Publish Date - 2023-10-13T13:00:26+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని నారా లోకేష్ అన్నారు.

అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనారోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తోందన్నారు. చంద్రబాబుకి ఏదైనా హాని జరిగితే, అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అన్నారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని లోకేష్ ఆరోపించారు. జైల్లో ఆయనకు తగిన భద్రత లేనందున ఆయన ఎంతో ప్రమాదంలో ఉన్నారన్నారు. దోమలు, కలుషిత నీరు, బరువు తగ్గడం, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు ఉన్నా సకాలంలో వైద్య సహాయాన్ని అందించట్లేదని వాపోయారు. చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని నారా లోకేష్ తెలిపారు.