Perni Nani : ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టం

ABN , First Publish Date - 2023-03-14T10:29:17+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బందర్‌లో జరిగే జనసేన సభ తస్మదియ దూషణ సభ మాత్రమే మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Perni Nani : ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టం

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బందర్‌లో జరిగే జనసేన సభ తస్మదియ దూషణ సభ మాత్రమే మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయ దృక్పథాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు తెలియజేశాడన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మేలు కోసం పవన్ రాజకీయం చేస్తానని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటం సభ, మచిలీపట్నం సభకు ఏమీ తేడాలేదన్నారు. జగన్‌ను బలపరిచే కాపు నాయకులని తిట్టడం చంద్రబాబును బలపరచడం కోసమే ఈ సభ అని పేర్ని నాని పేర్కొన్నారు.

కాపు కులాన్ని, కులస్తులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తున్నాడని పేర్ని నాని విమర్శించారు. పవన్ రాజకీయ సినిమా.. ఫ్లాప్ అయినా.. హిట్ అయిన పెద్దగా నష్టం లేదన్నారు. ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టమని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే వారిని తిట్టడం ముఖ్యంగా వైసీపీ (YCP)లోని కాపు నేతలను తిట్టడం పవన్ పనేనన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా నేడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి అధికారం కోసం ప్రయత్నం చేస్తారని.. కానీ పవన్ అలా కాదని పేర్ని నాని విమర్శించారు.

Updated Date - 2023-03-14T10:29:17+05:30 IST