TDP Leader: ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకు ఆమరణ దీక్ష

ABN , First Publish Date - 2023-07-30T19:04:00+05:30 IST

ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకు రేపటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని (In-charge Pulivarthi Nani) స్పష్టం చేశారు.

TDP Leader: ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకు ఆమరణ దీక్ష

తిరుపతి: ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకు రేపటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని (In-charge Pulivarthi Nani) స్పష్టం చేశారు.


"చంద్రగిరి మండలం, రెడ్డివారిపల్లె స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్‌లో తీసిన గోతిలో పడి కర్నూలుకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. స్వర్ణముఖినదిలో విద్యార్థి మృతి చెందిన నీటి కుంటను పులివర్తి నాని పరిశీలించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. విద్యార్థి మృతికి స్థానిక వైసీపీ (YCP) ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యత వహించాలి. విద్యార్థి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి. ఇసుక అక్రమ రవాణా దారులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలి. ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయాలి." అని పులివర్తి నాని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-30T19:07:59+05:30 IST