ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వివేకా హత్యకేసులో పాత్రధారులెవ్వరు ? సూత్రదారులెవ్వరు?’ పుస్తకం విడుదల

ABN, First Publish Date - 2023-02-10T11:42:29+05:30

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లకేళ్లు గడుస్తున్నా.. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ హత్య కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించిన తరువాత మాత్రం డొంకను కదిలించే యత్నం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లకేళ్లు గడుస్తున్నా.. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ హత్య కేసును తెలంగాణ పోలీసుల (Telangana Police)కు అప్పగించిన తరువాత మాత్రం డొంకను కదిలించే యత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)ని సీబీఐ (CBI) విచారించడం.. ఆ విచారణలో కీలక విషయాలు బయటకు రావడం వంటివి జరుగుతున్నాయి. ఈ విచారణ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సతీమణి భారతీ రెడ్డి (YS Bharati Reddy) పేరు బాగా హైలైట్ అవుతోంది. ఆమె పర్సనల్ సెక్రటరీ నవీన్ (Naveen) కూడా బాగా హైలైట్ అవుతున్నాడు. అయితే తాజాగా టీడీపీ (TDP) ఓ బుక్‌ను రిలీజ్ చేసింది. ఆ బుక్‌లో ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలన్నింటినీ టచ్ చేసింది. ‘వివేకానంద రెడ్డి హత్యకేసులో పాత్రధారులెవ్వరు ? సూత్రదారులెవ్వరు’ అనే వివరాలతో పుస్తకం రూపకల్పన జరిగింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జగనాసుర రక్త చరిత్ర పేరిట ఓ పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది. వివేకా హత్యలో వేళ్లన్నీ జగన్ రెడ్డి - భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు. ‘జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది. తాడేపల్లి ప్యాలెస్ (Tadepally Palace) అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని పుస్తకంలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన వేకువ జామున 3 గంటల సమయంలో జరిగిందని.. ఆ సమయంలోనే నవీన్ ఫోన్ ద్వారా భారతీరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా జగన్‌రెడ్డి మాట్లాడానని సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ వివరాలను పుస్తకంలో టీడీపీ పేర్కొంది. సీబీఐ చార్జిషీట్, వివేకా కుమార్తె సునీత (Viveka Daughter Sunitha) అఫిడవిట్స్, వైయస్ కుటుంబసభ్యుల వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం తదితర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అచ్చెన్నాయుడు (Atchennaidu), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary), నిమ్మల రామా నాయుడు (Nimmala Ramanaidu), నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu), బోండా ఉమ (Bonda Uma) తదితర నేతలు పుస్తకాన్ని విడుదల చేశారు.

Updated Date - 2023-02-10T11:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising