GVL: ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన దుస్థితి మాకు లేదు..

ABN , First Publish Date - 2023-06-13T13:06:39+05:30 IST

విశాఖ: ఎన్నికల సందర్భంగా రాజకీయ వేట ఊపు అందుకుందని.. నాలుగేళ్ల తర్వాత ఏపీలో సభ పెట్టి, అమిత్ షా మాట్లాడారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

GVL: ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన దుస్థితి మాకు లేదు..

విశాఖ: ఎన్నికల సందర్భంగా రాజకీయ వేట ఊపు అందుకుందని.. నాలుగేళ్ల తర్వాత ఏపీలో సభ పెట్టి, అమిత్ షా (Amit Shah) మాట్లాడారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ (PM Modi) తొమ్మిదేళ్ల పాలనపై ఏపీ రాష్ట్రానికి చేసిన అనేక అంశాలను ప్రస్తావించారన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై అమిత్ షా మాట్లాడారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అరాచకాలు , అక్రమాలు గురించి మాట్లాడితే వైసీపీ నేతలు (YCP Leaders) ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. పరిపాలన పేరుతో అక్రమాలు చేశారని దుయ్యబట్టారు.

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన దుస్థితి తమకు లేదని, బీజేపీ (BJP) ఎవరికీ అండగా ఉండదని జీవీఎల్ స్పష్టం చేశారు. బీజేపీ సానుకూలంగా ఉందనే భ్రమ రాజకీయాలు చేయడం, ముఖ్యమంత్రి మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు కూడా డ్రామా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చాలామంది మంత్రులు ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. తాము ఏం చేశామో పుస్తకాల్లో వేశామని, దమ్ముంటే చదువుకొని, బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. వాస్తవాలు చెప్పే ధైర్యముంటే జ్యుడీషియల్ ఎంక్వయిరీ వెయ్యాలన్నారు. విశాఖలో భూదందాలపై వేసిన సీట్లు ఏమయ్యాయన్నారు. భూ అక్రమార్కులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?.. వారిని కూర్చోబెట్టి సెటిల్‌మెంట్లు చేసుకుందా?.. అని ప్రశ్నించారు. జాతీయ రహదారులపై రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేశామని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.

Updated Date - 2023-06-13T13:06:39+05:30 IST