ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta Srinivasa Rao: తెల్లవారుజాము 5 గంటలకు అరెస్ట్ .. తిరిగి రాత్రి 9 గంటలకు బెయిల్‌పై విడుదల..!

ABN, First Publish Date - 2023-09-09T21:45:40+05:30

స్కిల్‌ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scheme) లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకు అక్రమంగా అరెస్ట్ చేశారు. అదే సమయంలో టీడీపీకి సంబంధించిన కీలక నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)ని కూడా ఈరోజు ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి.. రాత్రి 9 గంటల సమయానికి పీఎం పాలెం పోలీసు స్టేషన్ నుంచి బెయిల్‌పై విడుదల చేశారు.

విశాఖ: స్కిల్‌ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scheme) లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకు అక్రమంగా అరెస్ట్ చేశారు. అదే సమయంలో టీడీపీకి సంబంధించిన కీలక నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)ని కూడా ఈరోజు ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి.. రాత్రి 9 గంటల సమయానికి పీఎం పాలెం పోలీసు స్టేషన్ నుంచి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY) 16 నెలలు పైగా జైల్లో ఉన్నారు. చంద్రబాబు(Chandrababu) కూడా జైల్లో ఉండాలనేదే తన ఉద్దేశం. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చంద్రబాబు, తెలుగుదేశం నేతలను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయడానికి జగన్మోహన్‌రెడ్డి కుట్ర పన్నారు. చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ నాయకుడని.. ఎన్నో కీలక పదవుల్లో పని చేశారు. అలాంటి వ్యక్తికి ఎలాంటి నోటీసులు లేకుండా హడావుడిగా అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఉదయం 5 గంటలకు పోలీసులు నా ఇంటికి కూడా వచ్చారు. ముందుగా దిశా స్టేషన్‌కు తీసుకువచ్చారు... ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో 161 క్రింద నోటీసు ఇచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీ ధర్నా చేస్తే తప్ప కలవనివడం లేదు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు.జగన్‌రెడ్డి పరిపాలన ప్రజా వేదిక కూల్చడంతో మొదలైంది. ఇంతవరకు ఎక్కడ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వానికి కోర్టు ఎన్నో సార్లు చివాట్లు పెట్టింది. ఈ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. వివేకా మర్డర్ కేసు డైవర్ట్ చేయాలనే ఈ అరెస్ట్‌లు చేస్తున్నారు.రేపు ఉదయం గవర్నర్‌ను కలవబోతున్నాం. చంద్రబాబును A1 ముద్దాయిగా పెట్టి ఉదయం నుంచి తిప్పుతూ ఇప్పటికీ కూడా విచారిస్తునే ఉన్నారు.నాకు లాగే వాళ్లు కూడా అరెస్ట్‌లు అవ్వాలని జగన్‌రెడ్డి అనందపడుతున్నారు’’ అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2023-09-09T22:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising