Palla Srinivasa Rao : వైసీపీ ఎన్ని కేసులు పెట్టిన భయపడం
ABN , First Publish Date - 2023-10-01T17:33:44+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిన భయపడమని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం (గాజువాక): వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిన భయపడమని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా పాత గాజువాక జంక్షన్‌లో పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం పాలకుల అధికారంలో ఉన్న చట్టాలను తీసుకొస్తున్న వైసీపీ ప్రభుత్వానికి నిరసనగా బ్రిటిష్ సైనికుల వేషధారణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడానికి కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడరు. రానున్న రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రజలు త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడతారు’’ అని పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.