టీడీపీ గెలుపు.. జగన్‌ అరాచక పాలనపై తిరుగుబాటు: పితాని

ABN , First Publish Date - 2023-03-26T00:32:50+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉహించని రీతిలో టీడీపీ అభ్యర్థుల గెలుపుతో జగన్‌ అరాచకపాలనపై తిరుగుబాటు స్పష్టమైందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

టీడీపీ గెలుపు.. జగన్‌ అరాచక పాలనపై   తిరుగుబాటు: పితాని
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పితాని

పోడూరు, మార్చి 25: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉహించని రీతిలో టీడీపీ అభ్యర్థుల గెలుపుతో జగన్‌ అరాచకపాలనపై తిరుగుబాటు స్పష్టమైందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసి, రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఉన్న కంపెనీలు వేరేచోట్లకు తరలిపోయే పరిస్ధితులు కల్పించి యువతకు ఉద్యోగాలు లేకుండా చేయడంతో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, టీడీపీని గెలిపించి రాష్ర్టాన్ని కాపాడుకోవటానికి ఎన్నికలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల కు సమాయత్తమై సైనికుల్లా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. తొలుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్‌ కట్‌ చేసి నాయకులకు పంచిపెట్టారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతినీడి రాంబాబు, గొట్టుముక్కల సూర్య నారాయణరాజు, తమనంపూడి శ్రీనివాసరెడ్డి, నక్కా వేదవ్యాసశాస్ర్తి, రుద్రరాజు రవి, వెలగల బులిరామిరెడ్డి, తమ్మినీడి ప్రసాదు, మేడపాటి గంగాధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:32:50+05:30 IST