Share News

కోఢీ

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:05 AM

కోడి పందేలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు!. సంక్రాంతి వచ్చిందంటే వారం పది రోజుల ముందు నుంచే పందెం బరులు ఏర్పాటు చేస్తారు.

కోఢీ

లక్షలాది రూపాయలతో కొనుగోలు

రోజూ పోషక ఆహారం.. ప్రత్యేక శిక్షణ

దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ – వైసీపీ పార్టీల వారీగా బరులకు సిద్ధం

నియోజకవర్గంలో 14 చోట్ల

పందేలకు ముందస్తు సన్నాహాలు

దెందులూరు/ పెదవేగి, డిసెంబరు 23 :

కోడి పందేలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు!. సంక్రాంతి వచ్చిందంటే వారం పది రోజుల ముందు నుంచే పందెం బరులు ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చే పందెంరాయుళ్లు ఎంజాయ్‌ చేస్తూ.. కోట్లలో పందేలు కాస్తారు. ఇంతటి ఆదరణ ఉండడంతో పందెం కోళ్ల పెంపకం తీరే మారింది. ఉమ్మడి పశ్చిమ గోదారి జిల్లాలో బ్రాయిలర్‌ కోళ్ల పరిశ్రమల్లా పందెం పుంజుల పౌలీ్ట్రలు ఏకంగా వెయ్యికి పైగా ఉన్నాయంటే పందెం కోళ్లకు ఎంత ప్రాధాన్యం, ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సమీపిస్తుం డడంతో పలు ప్రాంతాల్లో పుంజుల పెంపకం జోరందుకుంది! ఆరు నూరైనా పందేలు వేసేందుకు పందేగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అనుమతులు వస్తాయన్న ధీమాతో ఈ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

సంక్రాంతికి కోడి పందేల నియంత్రణకు కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు రెవెన్యూ, పోలీసులు ప్రయత్నం చేస్తున్న ఈ ఏడాదీ పందేలు జరిగి తీరు తాయని పందెం రాయుళ్లు ధీమాగా ఉన్నారు. దెందులూరు నియో జక వర్గంలోని దుగ్గిరాల, కొండరా యుడు పాలెం, మొండూరు, లక్ష్మీపురం, వం గూరు, దెందులూరు, జోగన్నపాలెం, పెదపాడు, గంగన్నగూడెం, పాల గూడెం, కొణికి, గుండుగొలను తదితర గ్రామాల్లో పందేలు ఏటా భారీగా జరుగుతాయి. దెందు లూరులో ఈసారి టీడీపీ– వైసీపీ వర్గాలుగా పందేలకు అవకాశం ఉంది. వైసీపీ కీలక నేత భీమవరం నుంచి 30 జాతి పుంజులను ఒక్కొక్కొటి రూ.లక్ష 15 వేలకు కొనుగోలు చేసి వాటికి 15 మంది సిబ్బందితో శిక్షణ ఇస్తున్నారు. సంక్రాంతి బరిలో వైసీపీ నాయకులను ఓడించాలని కన్నాపురం,మొండూరుకు చెందిన టీడీపీ నేత లక్షలాది రూపాయలు వెచ్చించి కోళ్లను కొనుగోలు చేసి 10 మంది సిబ్బందిని నెలకు ఒక్కొక్కరికి రూ.20 వేలు వేతనం ఇచ్చి పుంజులకు శిక్షణ ఇస్తున్నారు.

కేబుల్‌ నిర్వహణ వారిదే..

సంక్రాంతికి కోడి పందేల అనధికార అనుమతి అధికార పార్టీ నాయకులే తీసుకుంటారు. కేబుల్‌ వసూలు చేసేది అధికార వారే ఉంటారు. వివిధ స్థాయిల్లో మామూళ్లు ఇచ్చేందుకు రూ.లక్ష పైన పందేలకు రూ.10 వేలు కేబుల్‌ను పక్కకు తీస్తారు. కోడి పందెల బిరు నిర్వాహణ, విద్యుత్‌, టిప్‌టాప్‌ సామగ్రి, టెంట్‌లు తదితర వాటికి పందెం జరిగే ప్రదేశంలో హోటల్‌, బిర్యానీ, డ్రింక్స్‌ వారు షాపుకు 10 వేలు కేబుల్‌ ఇవ్వాల్సిందే. గుండాట, పేకాట వాళ్లు నాలుగు రోజులు మీద రోజుకు లక్ష చొప్పున నాలుగు రోజులకు నాలుగు లక్షలు చెల్లించాల్సిందే. దుగ్గిరాలలోను, ఎమ్మెల్యే సొంత గ్రామం రాయుడుపాలెం పరిసర ప్రాంతాల్లో పండుగ నాలుగు రోజులు పందేలకు, జూదాలకు అడ్డే ఉండదు. నాలుగు నెలల కిందట పెద వేగి మండలం వేగివాడలో టీడీపీ–వైసీపీ నాయ కులు పామాయిల్‌ తోటలో పందేలు వేసేం దుకు సాయంత్రం 5 గంటలకు మాట్లాడుకుంటే రాత్రి 10 గంటలకల్లా బరి సిద్ధం చేశారు. 11 గంటల కు 300 మంది పందేగాళ్లు అక్కడకు రాగా కోటి రూపాయలతో కొన్ని గంటల్లో పందేలు వేశారు. ఒత్తిళ్లతో పోలీసులు మిన్న కుండడంతో స్పెషల్‌ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో ‘పెద్దలను’ వదిలేసి నట్టు ప్రచారం ఉంది. ఈ ఘటనలో సీఐ, ఎస్‌ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్న తాధికారులు వీఆర్‌కు పంపారు.

పుంజులకు ప్రత్యేక తర్ఫీదు

పందేల నిర్వహణ అంటే అప్పటిక ప్పుడు నిర్వహించేది కాదు. నెలల తరబడి కోడి పుంజులకు ప్రత్యేకమైన తర్ఫీదుతో శిక్షణ ఇస్తారు. కోడి పుంజు రంగు, ముఖ కవళికలు, పోరాడే విధానం అన్నీ పరిశీలించి, తదను గుణంగా ఎంపిక చేసిన కోడిపుంజులకు నాలుగు నెలల ముందునుంచి నెలరోజులు పూర్ణం తీసి వేసిన కోడి గుడ్లు పెడతారు. మూడునెలల పాటు మేక మాంసం కైమా, బాదం పప్పు అందిస్తారు. నెలకు రెండుసార్లు ఈత (స్విమ్మిం గ్‌), ప్రతిరోజూ నడక ఉంటుంది. శరీరం గట్టి పడడానికి వేప, జామాయిల్‌, జిల్లేడు, వావిలాకు, వెదురు వంటి ఆకులను వేసి, మరిగించిన నీటితో శరీ రం తడుపుతా రు. కాపడాలు ఉంటాయి. పెదవేగి మండ లంలో కొండ లరావుపాలెం, జానంపేట, లక్ష్మీపురం, కవ్వ గుంట, రామసింగవరం, వేగివాడల్లో పందేలు జరుగుతాయి. పుంజుల్లో కాకి, కోడి కాకి, పచ్చకాకి, డేగ, కాకి డేగ, కోడి డేగ, నెమలి, తెలుపు నెమలి, నల్ల నెమలి, తీతువా, రసంగి, పంగళ, అబ్రాస్‌, కొక్కిరాయి, గేరువా, కోడి పింగళ, పెట్టమారి, పర్ల, నల్ల కక్కెర వంటివి ఉంటాయి.

తిథి, వాస్తు ముఖ్యమే..

పందేంరాయుళ్లు తమ కోడి పందేలను వేసే రోజు ఉండే తిఽథి, ప్రదేశం, తూర్పు దిక్కు లేదా పడ మర దిక్కులు చూసుకుని వాటి ఆధారంగా చేసుకుని పందేల్లో ఏ కోడి గెలుస్తుందో అంచనా వేసుకు ని వాటిని బట్టి రంగు పుంజులను పందెం వేసేందుకు వదులుతారు.

Updated Date - Dec 24 , 2023 | 12:05 AM