తిరువీధుల్లో ఘనంగా ఉట్టి ఉత్సవం

ABN , First Publish Date - 2023-09-08T23:59:28+05:30 IST

రాజాధిరాజ వాహనంపై కొలువైన శ్రీవారు, అమ్మవార్ల ముందు యువకులు ఆనందోత్సాహాలతో ఉట్టి కొట్టి తమ భక్తిని చాటుకున్నారు.

తిరువీధుల్లో ఘనంగా ఉట్టి ఉత్సవం
ఆలయ కల్యాణ మండపం వద ఉట్టిని కొడుతున్న యువకులు

ద్వారకా తిరుమల, సెప్టెంబరు 8: రాజాధిరాజ వాహనంపై కొలువైన శ్రీవారు, అమ్మవార్ల ముందు యువకులు ఆనందోత్సాహాలతో ఉట్టి కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలయ కల్యాణ మండపం వద్ద యువ కులు ఉత్సాహంగా ఉట్టిని కొట్టారు. తిరు వీధుల్లో ఉట్లు కొడుతూ సందడి చేశారు. ముందుగా ఆలయంలో రాజాధిరాజ వాహ నంపై స్వామి, అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళ తాళాలు, డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ క్షేత్ర తిరువీధుల్లో ఊరేగారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-08T23:59:28+05:30 IST

News Hub