Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువులు.. ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-08-02T12:17:06+05:30 IST
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీలు , స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఖాళీలు 4451
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రెయినీలు , స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ
ఖాళీలు: 3,049
మొత్తం ఖాళీలు: 3,049(ఎస్సీ-462, ఎస్టీ-234, ఓబీసీ-829, ఈడబ్ల్యూఎస్-300, యూఆర్-1224)
బ్యాంకుల వారీగా ఖాళీలు
1. బ్యాంక్ ఆఫ్ బరోడా: ఎన్‌ఆర్(తెలుపలేదు)
2. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 224
3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎన్‌ఆర్
4. కెనరా బ్యాంక్: 500
5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000
6. ఇండియన్ బ్యాంక్: ఎన్‌ఆర్
7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఎన్‌ఆర్
8. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200
9. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 125
10. యూకో బ్యాంక్: ఎన్‌ఆర్
11. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎన్‌ఆర్
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు,కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 21
ప్రీ-ఎగ్జామ్ ట్రెయినింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: 2023 సెప్టెంబరు
ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్: 2023 సెప్టెంబరు
ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్ డౌన్‌లోడ్: 2023 సెప్టెంబరు
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: 2023 సెప్టెంబరు/అక్టోబరు
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: అక్టోబరు/నవంబరు
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: 2023 నవంబరు
మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు: 2023 డిసెంబరు
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: 2024 జనవరి/ఫిబ్రవరి
ఇంటర్వ్యూలు: 2024 జనవరి/ఫ్రిబవరి
తుది నియామకాలు: 2024 ఏప్రిల్
స్పెషలిస్ట్ ఆఫీసర్
ఖాళీలు: 1,402
రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా; ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
1. ఐటీ ఆఫీసర్(స్కేల్-1): 120 పోస్టులు
2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1): 500
3. రాజ్‌భాష అధికారి(స్కేల్-1): 41
4. లా ఆఫీసర్(స్కేల్-1): 10
5. హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్(స్కేల్-1): 31
6. మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 700
అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఆప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలకా్ట్రనిక్స్/ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). డిగ్రీ(అగ్రికల్చర్/హార్టికల్చర్/యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్/డెయిరీ సైన్స్/షిషరీ సైన్స్/పిసి కల్చర్/అగ్రి. మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్/కో- ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్/అగ్రో-ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ఫుడ్‌సైన్స్/అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/సెరికల్చర్/షిషరీస్ ఇంజనీరింగ్). పీజీ(ఎలకా్ట్రనిక్స్/ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్). పీజీ(హిందీ/సంస్కృతం). డిగ్రీ(ఎల్‌ఎల్‌బి), పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్‌ఆర్/హెచ్‌ఆర్‌డీ/సోషల్‌వర్క్/లేబర్ లా. ఎంఎంఎ్‌స(మార్కెటింగ్)/ఎంబీఏ(మార్కెటింగ్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం.
వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీనంగర్, ఖమ్మం, వరంగల్
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్(ప్రిలిమినరీ పరీక్ష: 2023 డిసెంబరు
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 30/31
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: 2024 జనవరి
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2024 జనవరి
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2024 జనవరి 28
తుది పరీక్ష ఫలితాల ప్రకటన: 2024 ఫిబ్రవరి
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: 2024 ఫిబ్రవరి/మార్చి.
ఇంటర్వ్యూలు: 2024 ఫిబ్రవరి/మార్చి
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2024 ఏప్రిల్
వెబ్‌సైట్: https://www.ibps.in/