CWC : ముగిసిన సీడబ్ల్యూసీ.. సమావేశంలో ఏం చర్చించారంటే..?
ABN, Publish Date - Dec 21 , 2023 | 07:49 PM
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగింది.ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు.
ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగింది.ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మూడోసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ రాజకీయాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పార్లమెంట్‌లో కేంద్ర వైఖరీ అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగుతోంది.వివిధ రాష్టాల్లో సీట్ల సర్దుబాటుపై డిసెంబర్ 19వ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ ఇతర పార్టీలతో పొత్తు రూపురేఖలను నిర్ణయిస్తుంది. జాతీయ కూటమి కమిటీలో కన్వీనర్లుగా భుపెష్ బాగేల్, అశోక్ గెహ్లాట్, ముకుల్ వాసినిక్, సల్మాన్ కుర్షిద్, మోహన్ ప్రకాష్ ఉన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, మీరా కుమారి, అజయ్ మాకెన్, మానిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, టి సుబ్బిరామిరెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.
త్వరలో లోక్‌సభ స్థానాలపై సమన్వయకర్తలను నియమకం: మల్లికార్జున ఖర్గే
పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటి వరకు ఇండియా కూటమికి చెందిన 143 మంది ఎంపీలను ఉభయ సభల్లో సస్పెండ్ చేసిన తీరు దురదృష్టకరమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ...‘‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలో ఆశించిన ఫలితాలు రాలేదు. భవిష్యత్తులో మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన పార్టీ నేతలకు అభినందనలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. వచ్చే లోకసభ ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన సహచరులతో సమన్వయం చేసుకుంటూ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి. మేము ఐదుగురు సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీని ఏర్పాటు చేశాం. ఇది ఇతర పార్టీలతో పొత్తుతో రూపురేఖలను నిర్ణయిస్తుంది. త్వరలో లోక్‌సభ స్థానాలపై సమన్వయకర్తలను కూడా నియమిస్తాం. డిసెంబర్ 28వ తేదీన కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మన ఉదాహరణ సంక్షోభంలో ఉంది. చర్చలు, చర్చలు లేకుండా ముఖ్యమైన బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదిస్తూ ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్న బీజేపీని దేశం మొత్తం చూస్తోంది. పార్లమెంటును అధికార పార్టీకి వేదికగా మార్చే కుట్ర జరుగుతోంది. ప్రస్తుత ప్రతిపక్షాలు లేకపోయినా ముఖ్యమైన బిల్లులన్నింటినీ ఆమోదిస్తూ పార్లమెంట్ గౌరవానికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
Updated Date - Dec 21 , 2023 | 07:49 PM