Former Chief Minister: ఎంజీఆర్‌, జయలలితకు మేమే వారసులం!

ABN , First Publish Date - 2023-01-30T10:21:09+05:30 IST

మాజీ ముఖ్యమంత్రులు దివంగత అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలితలకు సంతానం లేదని, ఆ ముగ్గురికి తామే వారసులమని, వారి

Former Chief Minister: ఎంజీఆర్‌, జయలలితకు మేమే వారసులం!

- ఎడప్పాడి పళనిస్వామి

పెరంబూర్‌(చెన్నై), జనవరి 29: మాజీ ముఖ్యమంత్రులు దివంగత అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలితలకు సంతానం లేదని, ఆ ముగ్గురికి తామే వారసులమని, వారి ఆశయాలు, లక్ష్యాలు సాధిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) తెలిపారు. సేలం జిల్లా మేలగౌండమ్‌పుదూర్‌లో ఉచిత వృద్ధాశ్రమాన్ని ఆదివారం ప్రారంభించిన పళనిస్వామి మాట్లాడుతూ, ‘పేదలు’ అన్న పేరు లేకుండా చూడాలన్నదే అన్నాడీఎంకే లక్ష్యమన్నారు. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు నెలకు రూ.1,000 పింఛన్‌ పథకం ప్రారంభించారన్నారు. ఈ పథకంలో 5 లక్షల మందికి పింఛన్‌ అందజేయనున్నట్లు తాను ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆ ప్రకారం 4.50 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు అందజేయగా, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని పళనిస్వామి ఆరోపించారు.

Updated Date - 2023-01-30T10:21:12+05:30 IST