Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతిపై అభిప్రాయాలు చెప్పండి : లా కమిషన్
ABN , First Publish Date - 2023-06-15T15:54:50+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code- UCC)పై అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలు, మతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం (Law Commission of India) కోరింది. 2018లో ఈ కమిషన్ విడుదల చేసిన ‘‘రిఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ’’పై కన్సల్టేషన్ పేపర్‌లో ‘‘ఈ దశలో యూసీసీ ఏర్పాటు అవసరం లేదు, వాంఛనీయం కాదు’’ అని తెలిపింది.

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code- UCC)పై అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలు, మతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం (Law Commission of India) కోరింది. 2018లో ఈ కమిషన్ విడుదల చేసిన ‘‘రిఫార్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ’’పై కన్సల్టేషన్ పేపర్‌లో ‘‘ఈ దశలో యూసీసీ ఏర్పాటు అవసరం లేదు, వాంఛనీయం కాదు’’ అని తెలిపింది. అయితే ప్రస్తుతం తాజాగా అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పంపిన రిఫరెన్స్‌ను కమిషన్ పరిశీలిస్తోంది.
21వ శాసన పరిశీలక సంఘం 2016, 2018 సంవత్సరాల్లో యూసీసీని పరిశీలించింది. వివిధ కోర్టు తీర్పుల నేపథ్యంలో దీని ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా మరోసారి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్లు లా కమిషన్ బుధవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ప్రజలు, గుర్తింపు పొందిన మత సంస్థలు 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను సమర్పించాలని తెలిపింది.
యూసీసీ అంటే..
దేశంలోని పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తించడమే ఉమ్మడి పౌర స్మృతి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో మతంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌర స్మృతి. ఇటువంటి అంశాల్లో ప్రస్తుతం వేర్వేరు మతస్థులకు వేర్వేరు చట్టాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని తొలగించి, దేశంలోని ప్రజలందరికీ ఒకే నిబంధనలు వర్తించే విధంగా చేయడం కోసం ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో అధికరణ 44 కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. అయితే దీనిని కోర్టులు అమలు చేయజాలవని అధికరణ 37 చెప్తోంది.
ఇవి కూడా చదవండి :
Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం