మణిపూర్‌పై విపక్షాలది మొసలి కన్నీరు
ABN , First Publish Date - 2023-08-16T02:55:44+05:30 IST
మణిపూర్ అల్లర్లపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు.

నిర్మలా సీతారామన్ విమర్శ
న్యూఢిల్లీ, ఆగస్టు 15: మణిపూర్ అల్లర్లపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మంగళవారం ఓ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ పార్లమెంటులో మణిపూర్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనలేదని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో వాకౌట్ చేశాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఒకటిరెండు లైన్లు మాట్లాడి వెళ్లిపోయారని అన్నారు. మణిపూర్ సమస్యను ప్రస్తావించినప్పుడు విపక్షాలు ఒకటి రెండు మొసలి కన్నీటి చుక్కలు రాల్చాయని ఆరోపించారు. మణిపూర్‌లో శాంతి, సామరస్యం నెలకొనాలని ప్రతి వారూ కోరుకుంటున్నారని, ప్రధాని, హోం మంత్రి కూడా ఇదే విషయమై భరోసా ఇచ్చారని చెప్పారు.