Tea vs Coffee: టీ వర్సెస్ కాఫీ.. రెండింటిలో ఏది తాగితే బెస్ట్..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

ABN , First Publish Date - 2023-08-04T15:02:31+05:30 IST

రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి.

Tea vs Coffee: టీ వర్సెస్ కాఫీ.. రెండింటిలో ఏది తాగితే బెస్ట్..? అసలు ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!
smaller amounts.

ఉదయాన్నే టీ తాగడానికి అలవాటు పడిపోయి ఉంటామేమో.. ఒకరోజు టీ తాగకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వెంటాడుతుంది. ఇక టీ తర్వాత మరో టీ తాగడానికి కూడా అలవాటు పడిపోయిన ప్రాణాలు చాలానే ఉంటాయి. ఇలా టీ కాఫీలకు అలవాటు పడటం వెనుక ఏ కారణం ఉన్నా, ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. టీ కాఫీ రెండింటి ప్రయోజనాలు, వాటివల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని ఏది తాగితే బెటర్ అని నిర్ణయించుకోవడం బెటర్.

1. టీ లో ఎల్ థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ (Stimulate) చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచనా శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

2. కాఫీ‌లో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే చాలామంది బ్లాక్ కాఫీని వర్కవుట్ ముందు ప్రీ వర్కవుట్‌గా తీసుకుంటూ ఉంటారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది. అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: తొందరగా పనైపోతుంది కదా అని కుక్కర్‌ను తెగ వాడేస్తుంటారా..? వీటిని మాత్రం అస్సలు ఉడికించొద్దు..!

టీ తాగడం వల్ల..

1. టీ పళ్లను పసుపు రంగులోకి మార్చుతుంది.

2. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది.

3. ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్‌ని తీసుకునే శక్తి 62 శాతం మేర తగ్గుతుంది.


కాఫీతో..

1. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35 శాతం మేరకే ఉంటుంది.

2. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది.

3. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

4. రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి.

5. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించండి.

ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (Irritable bowel syndrome) వంటి కొన్ని మందులు పరిస్థితులు పెద్ద మొత్తంలో కెఫీన్‌తో బాగా ఆడకపోవచ్చు. దీని అర్థం కాఫీ వంటి అధిక కెఫిన్ ఉన్న పానీయాలను దూరంగా ఉండాలి. అదేవిధంగా, గర్భవతిగా ఉన్నట్లయితే, తల్లిపాలు ఇస్తున్నట్లయితే, కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయాలి.

Updated Date - 2023-08-04T15:12:45+05:30 IST