Turkey hens: మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-03-03T22:24:38+05:30 IST

టర్కీ కోళ్లు ఉత్తర, మధ్య అమెరికా ప్రాంతానికి చెందినవి. ఇంగ్లండ్‌లో పాపులర్‌ అయ్యాయి. టర్కీ ప్రాంతానికి వచ్చిన తర్వవత వీటిని ‘టర్కీస్‌’ అనే పేరొచ్చింది.

Turkey hens: మీకు తెలుసా?


టర్కీ కోళ్లు ఉత్తర, మధ్య అమెరికా ప్రాంతానికి చెందినవి. ఇంగ్లండ్‌లో పాపులర్‌ అయ్యాయి. టర్కీ ప్రాంతానికి వచ్చిన తర్వవత వీటిని ‘టర్కీస్‌’ అనే పేరొచ్చింది.

ముక్కు దగ్గర ఎర్ర రంగు, నలుపు, నీలం, బ్రౌన్‌ ఉండే ఈ కోళ్లు నేలమీద డైనోసర్‌లా నడుస్తుంటాయి. వీటి ముక్కు మీద ఉండే ఎర్రటి చర్మం హార్మోన్లకు తగినట్లు రంగు మారుతుంటుంది.

ఇవి వైల్డ్‌ బర్డ్స్‌. వేటికి భయపడవు. ఆఖరికి మనుషులకూ భయపడవు. వాటి రెక్కలను డిజైన్‌ చేసినట్లు గుండ్రంగా చేయటం అద్భుతంగా ఉంటుంది. వయసు వచ్చిన టర్కీ బర్డ్‌కు ఐదువేల నుంచి ఆరువేల లోపు ఈకలుంటాయి.

ఇవి పదిమిలియన్ల సంవత్సరాల క్రితంకు చెందినవి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇకపోతే ఇవి గట్టిగా అరవటానికి ఇష్టపడవు. చెట్లమీద నిద్రపోతుంటాయి కూడా.

1.jpg

వైల్డ్‌ టర్కీస్‌ పరిగెత్తితే గంటకు 25 మైళ్లు, గాల్లో అయితే గంటకు 55 మైళ్లవరకూ ఎగురుతాయి.

వీటి గడ్డం సంవత్సరానికి కనీసం మూడు ఇంచులు పెరుగుతుంది.

అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ మీల్స్‌లో టర్కీస్‌ ఫుడ్‌ను వడ్డిస్తారు. కోళ్లలాగే ఫామ్స్‌లో పెంచుతారు. ఇవి గాల్లో ఎగరలేవు.

వీటి చూపు అద్భుతంగా ఉంటుంది. అడవిలో ఉన్నపుడు 270 డిగ్రీల్లో శతృవులను గమనిస్తుంది.

వీటి కడుపులో రాళ్లుంటాయి. వాటిని జీర్ణించుకుంటాయి.

10 లేదా 12 గుడ్లు పెడతాయి. పొదిగే కాలం 28 రోజులు.

Updated Date - 2023-03-03T22:24:38+05:30 IST