మీకు తెలుసా?
ABN , First Publish Date - 2023-10-05T00:13:21+05:30 IST
ఈ పక్షి పేరు.. మేజర్ మిచెల్ కాకటూ అంటారు. దీన్నే పింక్ కాకటూ అంటారు.1800 సంవత్సరంలో థామస్ మేజర్ మిచెల్ మొదటి సారిగా దీన్ని చూసి ప్రస్తావించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ..
ఈ పక్షి పేరు.. మేజర్ మిచెల్ కాకటూ అంటారు. దీన్నే పింక్ కాకటూ అంటారు.1800 సంవత్సరంలో థామస్ మేజర్ మిచెల్ మొదటి సారిగా దీన్ని చూసి ప్రస్తావించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
ఇదో చిలుక. ఇలాంటి రంగురంగుల చిలుకలు కనీసం 57 రకాలున్నాయి. ఇవన్నీ ఆస్ర్టేలియాలో ఉంటాయి.
ఇవి 300 గ్రాములు నుంచి 450 గ్రాముల మధ్యలో బరువు ఉంటాయి. పొడవు 35 నుంచి 45 సెం.మీ వరకూ ఉంటాయి. వింగ్ స్పాన్ 81 సెం.మీ.
మగ పక్షులు ఆడ పక్షుల కంటే పెద్దవిగా ఉంటాయి.
ఇవి ఉన్నచోటు తప్ప కొత్త ప్రదేశాలకు వెళ్లటానికి ఇష్టపడవు. ఆగష్టు నుంచి అక్టోబర్ మాసంలోపల రెండు నుంచి ఐదు గుడ్లు మాత్రమే పెడతాయి. వీటికి పొదిగే కాలం 23 రోజులనుంచి 30 రోజుల వరకూ ఉంటుంది.
చెట్లు కొట్టేయటంతో పాటు మనుషులు వీటి గుడ్లు మార్కెట్‌లో ఽధర ఉండటంతో వీటిని దొంగిలిస్తుంటారు.
పురుగులు, కీటకాలు తింటాయి. వీటి ముక్కు గట్టిగా ఉంటుంది. దీంతో చెట్టు తొర్రల్లో ఉండే పురుగుల కోసం బెరడును చీల్చిపడేస్తాయి. ఇకపోతే పెట్స్ మాత్రం ఫ్రూట్స్, గింజలు ఎక్కువగా తిని ఒబెసిటీకి గురవుతుంటాయి.
మామూలు చిలుకల్లా శబ్దం ఎక్కువ చేయవు. సైలెంట్‌గా ఉంటాయివి.
చాలా వరకు పంజరాల్లో ఉండే పక్షులివి. వీటి జీవనకాలం 50 ఏళ్ల దాకా ఉంటుంది. కొన్ని అరవై ఏళ్లు కూడా బతుకుతాయి.
ఇవి సాధ్యమైనంత వరకూ మనుషులతో స్నేహంగా, ప్రేమపూర్వకంగా ఉంటాయి. చనిపోయేంత వరకూ అదే తీరులో ఉంటాయి.
వీటికి పర్ఫెక్ట్‌గా శిక్షణ ఇస్తే అద్భుతంగా మాట్లాడతాయి. నిరంతరం మాట్లాడేందుకు ఇష్టపడతాయి.