TANA: తానా మహాసభలకు పద్మవిభూషణ్ సద్గురు రాక
ABN , First Publish Date - 2023-06-01T16:35:45+05:30 IST
ఉత్తర అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఫిలడెల్ఫియా, (అమెరికా): ఉత్తర అమెరికా (North America) ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ (Isha Foundation Sadguru Jaggi Vasudev) హాజరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూలై 7,8,9 తేదీల్లో మహా సభలను నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ సద్గురుతో పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు.
కోయంబత్తూరులో (Coimbatore) ఆదియోగి విగ్రహ ప్రాంగణలో ఈషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో సద్గురు పలు కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి పరిరక్షణ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్న నేపథ్యంలో తానా మహాసభలకు ఆయన రాక మరింత ఆనందదాయకంగా ఉంటుందని తానా (TANA) మహాసభల నిర్వాహకులు పేర్కొన్నారు.