Share News

CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?

ABN , First Publish Date - 2023-11-09T18:31:52+05:30 IST

CM KCR Assets : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంత..? గులాబీ బాస్ పేరిట ఏమేం ఉన్నాయి..? ఆయన భూమి ఎంత.. ఎన్ని కార్లు ఉన్నాయి..? అంతకుమించి అప్పులు ఎన్ని..? అని తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం నాడు అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో రెండు చోట్లా సీఎం నామినేషన్లు దాఖలు చేయడంతో ఆస్తుల గురించి తెలుసుకోవడానికి జనాలు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంత..? గులాబీ బాస్ పేరిట ఏమేం ఉన్నాయి..? ఆయన భూమి ఎంత.. ఎన్ని కార్లు ఉన్నాయి..? అంతకుమించి అప్పులు ఎన్ని..? అని తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం నాడు అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో రెండు చోట్లా సీఎం నామినేషన్లు దాఖలు చేయడంతో ఆస్తుల గురించి తెలుసుకోవడానికి జనాలు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా కేసీఆర్ ‌ పేర్కొన్ని విస్తుపోయే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి.


KCR-Assets-F.jpg

ఇదిగో ఆస్తుల లెక్కలు..

  • ఆస్తులు : రూ. 58.17 కోట్లు

  • చరాస్తులు : రూ. 35.42 కోట్లు (నగదు, డిపాజిట్లు, టీ-న్యూస్‌లో పెట్టుబడులు)

  • కార్లు, వ్యవసాయ భూములు, ఇతర వాహనాలు లేవు

  • కేసీఆర్ పేరిట అప్పు : రూ. 17.12 కోట్లు

  • కుటుంబం అప్పు : రూ. 7.23 కోట్లు

  • ఏడాదికి ఆదాయం : రూ. 1.60 కోట్లు

  • సాగు భూమి : 53.30 ఎకరాలు

  • వ్యవసాయేతర భూమి : .36 ఎకరాలు

  • శోభ పేరిట చరాస్తులు : రూ. 7.78 కోట్లు

  • ఉమ్మడి చరాస్తులు : రూ. 9.81 కోట్లు.

  • కేసీఆర్‌కు ఏమేం ఉన్నాయ్ : ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీల్లాంటి 14 వాహనాలు (విలువ కోటీ 16 లక్షలు)

  • కేసులు : ఉద్యమం సమయంలో నమోదైన 9 కేసులు

KCR.jpg

అవునా.. నిజమా..!?

కేసీఆర్ అఫిడవిట్‌లోని విషయాలను తెలుసుకున్న తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అవునా.. ఇది ఎంతవరకు నిజమబ్బా.. అయినా చిన్నపాటి లీడర్లే తమ పేరిట ఎలాంటి ఆస్తులు పెట్టుకోరు.. అలాంటిది సీఎం లాంటి వ్యక్తులు ఎందుకు ఆస్తులు చూపిస్తారంటూ అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయమే వృత్తిగా భావిస్తూ.. ఎక్కువ సమయం తన వ్యవసాయ క్షేత్రంలోనే గడిపే కేసీఆర్‌కు తన పేరు మీద ఎలాంటి భూమి.. అదీ ఒక్క గుంట కూడా లేకపోవటమడమేంటి..? అని కేసీఆర్ చెప్పడం అందరినీ షాకింగ్‌కు గురిచేసే విషయం. వాస్తవానికి ప్రత్యేకంగా ఆయన పేరు మీద ఎలాంటి భూములు లేకపోయినప్పటికీ.. ఉన్న స్థలాలన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయని అఫిడవిట్‌లో కేసీఆర్ రాసుకొచ్చారు. వాస్తవానికి.. కేసీఆర్ పదే పదే తాను కూడా రైతునేనని ఇప్పటికీ వ్యవసాయం చేస్తానని.. ఎన్నికల్లో ఓడిపోతే వెళ్లి వ్యవసాయమే చేసుకుంటానని పదే పదే బహిరంగ సభల్లో, అసెంబ్లీలో కేసీఆర్ చెబుతుంటారు. ఈ ఆస్తుల లెక్కలు చూసిన తర్వాత తెలుగు ప్రజలు.. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కంగుతింటున్నారు.

Updated Date - 2023-11-09T18:35:21+05:30 IST