Nita Ambani: బాబోయ్.. నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్‌‌కి ఇంత ఫీజా?.. చాలామంది సీఈవోలే పనికిరారు.. | Nita Ambanis make up artist Mickey Contractor salary shocks you psnr

Nita Ambani: బాబోయ్.. నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్‌‌కి ఇంత ఫీజా?.. చాలామంది సీఈవోలే పనికిరారు..

ABN , First Publish Date - 2023-03-08T22:09:28+05:30 IST

సంపన్న భారతీయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) 59 ఏళ్ల వయసులో అందంగా కనిపిస్తారు...

Nita Ambani: బాబోయ్.. నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్‌‌కి ఇంత ఫీజా?.. చాలామంది సీఈవోలే పనికిరారు..

ముంబై: సంపన్న భారతీయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) 59 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తారు. స్టైలిష్‌గా కనిపించే భారతీయ వ్యాపారవేత్తల్లో ఆమె కూడా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మనువడిని ఆడిస్తున్న ఈ వయసులోనూ ఫ్యామిలీ, బిజినెస్ ఫంక్షన్లలో ఆమె చాలా చక్కగా ముస్తాబై కనిపిస్తుంటారు. అయితే నీతా అంబానీ ఇంత అందంగా కనిపించడం వెనుక మిక్కీ కాంట్రాక్టర్ (Mickey Contractor) అనే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాడు. నీతా అంబానీ కూతురు ఈషా అంబానీ (Isha Ambani), కోడలు శ్లోకా అంబానీకి (Shloka Ambani) అతడే మేకప్ సర్వీసు అందిస్తుంటాడు.

Untitled-2.jpg

మిక్కీ కాంట్రాక్టర్ ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కావడంతో భారీగా ఛార్జీ వసూలు చేస్తాడు. ఎంతగా అంటే.. ఒక రోజుకు ఒక వ్యక్తికి మేకప్ చేస్తే ఏకంగా రూ.75 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఫీజు తీసుకుంటాడు. అందులోనూ ముంబైలో మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అందుకే అందరూ ఈయన ఛార్జీలు భరించలేదు. ఈయన సంపాదన ముందు చాలామంది సీఈవోలు కూడా సరిపోరు.

మిక్కీ కాంట్రాక్టర్ ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లోనూ పనిచేశారు. హమ్ ఆప్కే కౌన్, దిల్ టు పగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తిక్, డాన్, వీరే ది వెడ్డింగ్, గుడ్‌న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సినిమాల్లో పనిచేశాడు. మిక్కీ కాంట్రాక్టర్ క్లయింట్ల జాబితాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మతోపాటు పలువురు ఆయన వద్దే మేకప్ చేయించుకుంటారు. ఇక నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా మిక్కీ కాంట్రాక్టర్ కొనసాగుతున్నారు. కాగా మిక్కీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదిగారు. టోక్యో బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న సమయంలో సినిమా వ్యాపారంలోకి అడుగుపెట్టాలని మిక్కీని యాక్టర్ హెలెన్ కోరారు. దీంతో ఆయన సినిమా ఫీల్డ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌గా ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్నడూ తిరిగి చూసుకున్నది లేదు. కాగా ఐపీఎల్‌లో (IPL) మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌ని (Mumbai Indians) నీతా అంబానీయే స్వయంగా నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-03-08T22:13:58+05:30 IST