Ambulance: సడన్‌గా తండ్రికి అస్వస్థత.. ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో.. చివరకు ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలుసా..

ABN , First Publish Date - 2023-02-11T20:30:32+05:30 IST

కొన్నిసార్లు కొన్ని నిముషాల ఆలస్యం కూడా.. విలువైన ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితి వస్తుంటుంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల సమయంలో సమయానికి అంబులెన్స్ రాకపోవడం, సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చకపోవడం వల్ల.. నిండు ప్రాణాలు..

Ambulance: సడన్‌గా తండ్రికి అస్వస్థత.. ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో.. చివరకు ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు కొన్ని నిముషాల ఆలస్యం కూడా.. విలువైన ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితి వస్తుంటుంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల సమయంలో సమయానికి అంబులెన్స్ రాకపోవడం, సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చకపోవడం వల్ల.. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజగా, మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సడన్‌గా అస్వస్థతకు గురయ్యాడు. అయితే అంబులెన్స్ మాత్రం ఎంతకీ రాలేదు. దీంతో చివరకు ఏడేళ్ల కొడుకు తీసుకున్న నిర్ణయంపై.. అంతా శభాష్ అంటూ అభినందిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సింగ్రౌలీ పరిధి కొత్వాలికి సమీపంలోని బలియారి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల సడన్‌గా తీవ్ర అస్వస్థతకు (Illness) గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే అంబులెన్స్‌కి (Ambulance) ఫోన్ చేశారు. అయితే అర్ధగంట గడుస్తున్నా వాహనం రాలేదు. మరోవైపు సదరు వ్యక్తి ఆరోగ్యం విషమిస్తూ వచ్చింది. కుటుంబ సభ్యులు కంగారు పడుతుండగా.. వారి ఏడేళ్ల కొడుకు (Seven year old son) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సమీపంలో ఉన్న తోపుడు బండిని (Handcart) తీసుకొచ్చాడు. దానిపై అతన్ని పడుకోబెట్టి, భార్య, కుమారుడు తోసుకుంటూ.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Axis Bank: మీకు యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉందా..? కస్టమర్లకు పండగలాంటి వార్త..!

Madhya-Pradesh-News.jpg

వీడియో వైరల్ (Viral photos and videos) అవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై సింగ్రౌలి జిల్లా అదనపు కలెక్టర్ (additional district collector).. విచారణకు ఆదేశించారు. తోపుడు బండిపై రోగిని తరలించడం బాధాకరమన్నారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్యాధికారులను (medical officers) ఆదేశించారు. అంబులెన్స్ ఆలస్యానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, విచారణ అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-02-11T20:31:52+05:30 IST