SharvanandMarriage: అదితిరావు, సిద్ధార్థ్ కలిసి ఉంటున్నారా, ఇది చూస్తే అలానే అనిపిస్తోంది

ABN , First Publish Date - 2023-01-26T16:57:13+05:30 IST

అయితే ఈరోజు అంటే జనవరి 26 వ తేదీన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దానికి చాలామంది సినిమా పరిశ్రమలోని వారు, ఇతర ప్రముఖులు విచ్చేసారు. అందులో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ కూడా వున్నారు.

SharvanandMarriage: అదితిరావు, సిద్ధార్థ్ కలిసి ఉంటున్నారా, ఇది చూస్తే అలానే అనిపిస్తోంది

చిత్ర పరిశ్రమలో చాలా వార్తలు అటూ ఇటూ దొర్లుతూ ఉంటాయి. పెళ్లి వ్యవహారాలు, విడాకులు, కలిసుండడాలు ఒకటేమిటి చాలా నడుస్తూ ఉంటాయి. అయితే అవి నిజామా, కాదా అని ఆ వార్తకి సంబదించిన వ్యక్తిని అడిగితే కొట్టి పారేస్తాడు. సాంఘీక మాధ్యమాలు అంతే అలాంటివన్నీ పుట్టిస్తాయి అంటారు. మరి ఆలా కాకుండా వాళ్లిద్దరూ కలిసి తిరుగుతూ, కలిసి అన్ని ఫంక్షన్స్ కి వస్తూ ఉంటే, వాళ్ళని ఏమనాలి. ఇదే నటుడు సిద్ధార్థ్ (Actor Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) విషయంలో కూడా జరిగింది. వాళ్లిద్దరూ కలిసే వుంటున్నారు అన్న విషయం సాంఘీక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అలాగే సిద్ధార్థ్, అదితిరావు కూడా తమ సాంఘీక మాధ్యమాల్లో ఒకరినొకరు చాల మాట్లాడుకుంటున్నారు కూడా. ఆమధ్య ఒక రియాలిటీ షో లో నటుడు శర్వానంద్ ని అదితిరావు హైదరీ గురించి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అడిగినప్పుడు (Unstoppable with NBK) ఆమె సిద్ధార్థ్ తో ఉంటోంది కదా అని చెప్పేసాడు. కానీ సిద్ధార్థ్, అదితి ఇద్దరూ ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. (Siddarth and Aditi Rao spotted at the engagement of Sharwanand in Hyderabad)

sharwa-siddhu.jpg

అయితే ఈరోజు అంటే జనవరి 26 వ తేదీన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. దానికి చాలామంది సినిమా పరిశ్రమలోని వారు, ఇతర ప్రముఖులు విచ్చేసారు. అందులో సిద్ధార్థ్, అదితిరావు హైదరీ కూడా వున్నారు. అయితే ఇందులో ప్రాముఖ్యం ఏంటి అని అనుకుంటే, వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, కలిసే చాలాసేపు శర్వానంద్ తో వున్నారు, మళ్ళీ కలిసే వెళ్లారు. వీళ్లిద్దరి గురించే అక్కడ ఎంగేజ్ మెంట్ లో అందరూ మాట్లాడుకున్నారు అని అక్కడి వారు చాలామంది చెపుతున్నారు. (All eyes are on Siddharth and Aditi Rao at this Sharwanand's engagement function, says a source) అయితే మరి సిద్ధార్థ్, అదితిరావు కలిసి ఉండడానికే ఇష్టపడుతున్నారా, లేక పెళ్లి వరకు వెళతారా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. సిద్ధార్థ్ కి మాత్రం అదితిరావు ఏమి మొదటి గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇంతకు ముందు కొంత మందితో అతను సహ జీవనం చేసాడు, అంతకు ముందు పెళ్లి కూడా అయింది. అదితిరావు హైదరీ కి కూడా ఇంతకు ముందు పెళ్లి అయింది, తరువాత విడాకులు కూడా అయింది. మరి సిద్ధార్థ్ ఈమె తో అయినా ఎక్కువ కలం ఉంటాడా, లేక అంతకు ముందు వాళ్ళ లా ఇది కూడా మూడు నాళ్ళ ముచ్చటేనా అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. (Are they live-in relationship are going to marry is the million dollar question)

Updated Date - 2023-01-26T16:59:39+05:30 IST