Share News

AC suburban train: చెన్నైలో తొలి ఏసీ సబర్బన్‌ రైలు..

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:27 PM

చెన్నై మహానగరంలో తొలి ఏసీ సబర్బన్‌ రైలు అందుబాటులోకి రానుంది. అయితే.. ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగనుంది. ఎప్పటినుంచోొ ఎదురుచూస్తున్న ప్రమాణికులకు అతి త్వరలోనే ఈ రైలు అందుబాటులోకి రానుంది.

AC suburban train: చెన్నైలో తొలి ఏసీ సబర్బన్‌ రైలు..

- ప్రధాన రైల్వేస్టేషన్లలో మాత్రమే హాల్ట్‌

- త్వరలో ప్రకటన

చెన్నై: రాజధాని నగరంలో అందుబాటులోకి రానున్న తొలి ఏసీ సబర్బన్‌ రైలు(AC suburban train) ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. ఈ మేరకు రైల్వేస్టేషన్ల వివరాలు, ప్రయాణ సమయాలను సిద్ధం చేశారు. ఏసీ సబర్బన్‌ రైలు ప్రారంభం తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. నగరం, శివారు ప్రాంతాలు కలిపేలా చెన్నై బీచ్‌-తాంబరం, చెంగల్పట్టు, చెన్నై సెంట్రల్‌-తిరువళ్లూర్‌-అరక్కోణం, చెన్నై సెంట్రల్‌-గుమ్మిడిపూండి మార్గాల్లో సబర్బన్‌ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Maharashtra Politics: మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం


చెన్నై బీచ్‌-చెంగల్పట్టు మార్గంలో ఏసీ సబర్బన్‌ రైలు నడపాలనే ప్రయాణికుల విజ్ఞప్తిపై స్పందించిన రైల్వే శాఖ, రైలు తయారీ బాధ్యతను ఐసిఎ్‌ఫకు అప్పగించింది. ఈ రైలులో 1,116 మంది కూర్చొని, 3,798 మంది నిల్చుని ప్రయాణించేలా డిజైన్‌ చేశారు. ఐసిఎఫ్‌లో ఏసీ సబర్బన్‌ రైలు తయారవగా, ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా నిర్వహించారు. త్వరలో ఈ రైలు ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, ఈ రైలు ప్రధాన రైల్వేస్టేషన్‌లలో మాత్రమే ఆగనుందని సమాచారం.


nani6.2.jpg

ఏసీ రైలు ఆగే స్టేషన్ల వివరాలు...

చెన్నై ఫోర్ట్‌, పార్క్‌, ఎగ్మూర్‌, మాంబళం, గిండి, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, తాంబరం, పెరుంగళత్తూర్‌, పొత్తేరి, సింగపెరుమాళ్‌కోయిల్‌, భరనూరు, చెంగల్పట్టు.

ఉదయం 5.45-6.45 తాంబరం-చెన్నై బీచ్‌

ఉదయం 7-8.35 చెన్నై బీచ్‌-చెంగల్పట్టు

ఉదయం 9-10.30 చెంగల్పట్టు-చెన్నై బీచ్‌

మధ్యాహ్నం 3.45-5.25 చెన్నై బీచ్‌-చెంగల్పట్టు

సాయంత్రం 5.45-7.15 చెంగల్పట్టు-చెన్నై బీచ్‌

రాత్రి 7.35-8.30 చెన్నై బీచ్‌-తాంబరం


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2025 | 01:27 PM