Traditional Indian Parrot Wedding: చిలకల పెళ్ళి సందడి.. ఎంత వైభవంగా చేసారంటే..!
ABN , First Publish Date - 2023-02-08T13:15:02+05:30 IST
రెండు పెంపుడు రామచిలకల పెళ్లికి ఈరంతా సందడే.. రంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళి వేడుక..
జంతువులను సాకడం అందరికీ అలవాటే.. అందులో కుక్కలు, పిల్లులు, చిలుకలు ముఖ్యంగా పెంచుకుంటూ ఉంటారు. వీటిని ఇంట్లో మనుషుల్లా చూసేవారూ ఉంటారు. వీటితో విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంటూ ఉంటారు. అయితే పెంపుడు జంతువులకు పెళ్ళి చేయాలనే ఆలోచన రావడం కాస్త భిన్నంగానే ఉన్నా కూడా పూర్వంలో వర్షాలు పడాలని కప్పలకి పెళ్ళిళ్ళు చేసావారు. అలాగే వేప, రావి చెట్లకు పూజలు చేసి పెళ్ళిచేసే సాంప్రదాయం కూడా మనలో ఉంది. అయితే ఇక్కడో జంతుప్రేమికుడు తను పెంచుకుంటున్న రామచిలకలకు పెళ్ళి వైభవంగా చేసి వైరల్ అయ్యాడు. విషయంలోకి వెళితే..
రెండు పెంపుడు రామచిలకల పెళ్లి రంగరంగ వైభవంగా జరిగిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కరేలీలో జరిగింది.(Animals Marriage)కరేలి సమీపంలోని పిపారియా గ్రామంలో పెంపుడు చిలకమ్మ విచిత్ర వివాహం భారతీయ సంప్రదాయ బద్ధంగా జరిగింది.(Marriage of Parrots) పిపారియా గ్రామానికి చెందిన రామస్వరూప్ పరిహార్ ఓ ఆడ చిలకను సొంత కూతురిలా పెంచుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మకు ఒక చిలక ఉంది. వివాహం భారతీయ ఆచారాలతో పాటు చిలకల జాతకం సరిపోల్చి ఈ పెళ్ళి చేశారు.
బద్దల్ విశ్వకర్మ(Madhya Pradesh) గ్రామంలోని అతిథుల సమక్షంలో రెండు చిలకల వివాహం వైభవంగా జరిగింది.ఈ విచిత్ర వివాహ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు, జిల్లా సభ్యులు విజయ్ పటేల్, ఆదిత్య మోహన్ పటేల్, పితం పటేల్, దేవి సింగ్ పటేల్, అశోక్ పటేల్, రాము పటేల్, రజ్జు పటేల్, పురుషోత్తం శివన్య, సునీల్ పటేల్, విమలేష్ పటేల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
చిలకమ్మ పెళ్లి బరాత్ ఊరేగింపులో బాజా భజంత్రీల మోతలకు పెళ్లికి వచ్చిన అతిథులంతా ఉత్సాహంగా నృత్యం కూడా చేశారు. ఈ సందడిలోనే పెళ్ళి జంటను ఊరేగించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసాడు యజమాని. చిన్న నాలుగు చక్రాల వాహనంపై చిలక పంజరం పెట్టి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలు రామస్వరూప్ పరిహార్ ఇంట్లోనే జరిగాయి. ఈ అపూర్వ వివాహం మొత్తం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందిప్పుడు.