Metro Train: రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ప్రేమ జంట రొమాన్స్.. ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-09-06T18:00:01+05:30 IST

మెట్రో రైళ్లలో సీటు కోసం ఒకరినొకరు తోసుకోవడం, జనం మధ్యలో కొందరు ఉన్నట్టుండి డాన్సులు వేయడం, ఇంకొందరు చిత్రవిచిత్రమైన డ్రస్సులతో ఫ్యాషన్ షో చేయడం.. వంటి ఘటనలను తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా..

Metro Train: రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ప్రేమ జంట రొమాన్స్.. ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..!

మెట్రో రైళ్లలో సీటు కోసం ఒకరినొకరు తోసుకోవడం, జనం మధ్యలో కొందరు ఉన్నట్టుండి డాన్సులు వేయడం, ఇంకొందరు చిత్రవిచిత్రమైన డ్రస్సులతో ఫ్యాషన్ షో చేయడం.. వంటి ఘటనలను తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, మెట్రో రైల్లో ఓ ప్రేమ జంట నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్ మొదలెట్టింది. దీంతో ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..

ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై మెట్రో తరహాలోనే ఢిల్లీలోని మెట్రో రైలు కూడా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఎంతలా అంటే.. కనీసం కాలు తీసి కాలు పెట్టడానికీ చోటు లేదు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట (love couple) చుట్టూ ఉన్న జనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తమ ధ్యాసలో తాము మునిగిపోయారు. ఇద్దరూ హత్తుకుని ఉండడంతో పాటూ ముద్దులు (kisses) పెట్టుకుంటూ తాకరాని చోట తాకుతూ రొమాన్స్ చేసుకుంటున్నారు. ‘‘వీళ్లకి ఇంకెక్కడా చోటు లేనట్లు రైలే దొరికిందా’’.. అని కొందరు మనసులో అనుకుంటూ మిన్నకుండిపోయారు. ఇంకొందరు మనకెందుకొచ్చిన గొడవ.. అనుకుంటూ మౌనంగా ఉండిపోయారు. అయితే ఓ వృద్ధురాలు (old woman) మాత్రం చాలా సేపటి నుంచి వారిని గమనిస్తూ ఉంది.

Snake vs Gun Man: అర్రెర్రే.. ఇలా జరిగిందేంటి..? పామును చంపేద్దామని గన్ను తీసుకుని గురిపెట్టి కాల్చితే..!

అయితే ఎంతకీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చివరకు ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏంటమ్మాయ్.. కొంచెమైనా బుద్ధుందా మీకూ.. నలుగురూ ఉన్నారన్నా ఇంగితం కూడా లేకుండా ఏంటిది’’.. అని ఇద్దరిపై కసురుకుంది. అందరి ముందు వృద్ధురాలు నిలదీయడంతో యువకుడికీ కోపం కట్టలు తెంచుకుంది. ‘‘మా ఇష్టం మాది.. మధ్యలో మమ్మల్ని నిలదీయడానికి నువ్వెవరు’’.. అంటూ ఎదురు ప్రశ్నించాడు. దీంతో కొద్దిసేపు వారి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చివరకు పక్కన ఉన్న వారు కలుగజేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇటీవల చాలా మంది ప్రేమికుల ప్రవర్తన ఇలాగే ఉంది’’.. అని కొందరు, ‘‘ఎంత ప్రేమికులైతే మాత్ర.. అందరి ముందూ ఇలాంటి పనులు చేయడం తగదు’’.. అని మరికొందరు , ‘‘బామ్మ.. బాగానే బుద్ధి చెప్పింది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

Updated Date - 2023-09-06T18:00:01+05:30 IST