Viral Video: తలలో లక్షలాది పేలతో హెయిర్ కేర్ సెంటర్కి వెళ్లిన యువతి.. వారు చేసిన చిన్న చిట్కాతో చివరికి ఏమైందో చూడండి..
ABN , First Publish Date - 2023-09-17T18:20:47+05:30 IST
తలలో ఒకటి, రెండు పేలు ఉంటేనే ఒకటే దురద పెడుతూ ఉంటుంది. అలాంటిది ఇక తల నిండా పేలే ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జుట్టు సరంక్షణలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే తలలో పేలతో ఇబ్బంది పడే రోజులు..
తలలో ఒకటి, రెండు పేలు ఉంటేనే ఒకటే దురద పెడుతూ ఉంటుంది. అలాంటిది ఇక తల నిండా పేలే ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జుట్టు సరంక్షణలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే తలలో పేలతో ఇబ్బంది పడే రోజులు.. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం చాలా తక్కువనే చెప్పాలి. రోజురోజుకూ మారుతున్న వాతావరణంతో పాటూ వివిధ రకాల షాంపులు వాడుతుండడం వల్ల పేల సమస్య దాదాపు తగ్గిపోయింది. అయితే ఇలాంటి ప్రస్తుత తరుణంలో ఓ యువతి తలలో పేలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తల నిండా పేలతో హెయిర్ కేర్ సెంటర్కి వెళ్లగా.. అక్కడ వారు చేసిన చిన్న చిట్కాతో చివరికి ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఎప్పుడైనా తల దువ్వుకుంటున్న సమయంలో దువ్వెనలో ఒకట్రెండు పేలు కనిపిస్తేనే చాలా మంది తెగ కంగారుపడిపోతుంటారు. అలాంటిది ఇక తల నిండా గుట్టలు గుట్టలుగా పేలు ఉంటే.. ఊహించడానికే భయంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యతో ఓ యువతి (young woman head is full of lice) హెయిర్ కేర్ సెంటర్కు వెళ్లింది. ఆమె తలలో ఉన్న లక్షలాది పేలను చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆమె తల మొత్తం పరీక్షించిన సెంటర్ నిర్వాహకురాలు.. యువతికి పేలతో పాటూ చుండ్రు సమస్య కూడా ఉన్నట్లు గుర్తిస్తుంది.
Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదే.. సమయానికి ఈమె రాకుంటే.. ఈ పిల్లాడి పరిస్థితి ఏమయ్యేదో..
చివరకు ఆమె తలపై షాంపూ వంటి పదార్థాన్ని పూస్తుంది. కొద్ది సేపటి తర్వాత తలలో దువ్వెన పెట్టి కిందకు దువ్వుతుంది. దీంతో తలలోని పేలన్నీ ఆశ్చర్యకరంగా కింద ఉన్న పాత్రలో పడిపోతాయి. ఇలా కొద్ది సేపటి తర్వాత చూడగా.. ఆమె తల మొత్తం శుభ్రంగా తయారవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇలాంటి సమస్య ఎక్కడా చూల్లేదు బాబోయ్’’.. అని కొందరు, ‘‘ఇన్ని పేలతో ఆమె ఎలా నెట్టుకొచ్చిందో’’.. అని మరికొందరు, ‘‘పేల ఫామ్ ఏమైనా పెట్టిందేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.