Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదే.. సమయానికి ఈమె రాకుంటే.. ఈ పిల్లాడి పరిస్థితి ఏమయ్యేదో..
ABN , First Publish Date - 2023-09-17T17:36:27+05:30 IST
కొన్నిసార్లు కొందరి సమయస్ఫూర్తి.. ఎంతో మందిని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. అలాగే మరికొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడేస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్లముందు నిత్యం ఎన్నో సంఘటనలు చేటుచేసుకుంటుంటాయి. ప్రధానంగా..
కొన్నిసార్లు కొందరి సమయస్ఫూర్తి.. ఎంతో మందిని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. అలాగే మరికొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడేస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్లముందు నిత్యం ఎన్నో సంఘటనలు చేటుచేసుకుంటుంటాయి. ప్రధానంగా గుండెపోటుకు గురై ఇబ్బందిపడుతున్న ఎంతో మందిని కొందరు సమయానికి స్పందించి కాపాడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లాడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని ఊపిరాడక ఇబ్బందిపడుతున్న పిల్లాడిని ఓ మహిళ ఎలా కాపాడిందో చూడండి..
సోషల్ మీబడిచాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. చాక్లెట్ తింటున్న కొడుకును ఓ తల్లి పైకి ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటుంది. ఇలాంటి సంతోషకర సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. చాక్లెట్ గొంతులో (Chocolate stuck in child throat) ఇరుక్కోవడంతో పిల్లాడు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటాడు. దీంతో తన కొడుక్కి ఏమైందో అని తల్లి కూడా తెగ కంగారుపడుతుంది. గట్టిగా కేకలు పెడుతూ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తుంటుంది. అయినా ఆమె వల్ల సాధ్యం కాదు. ఈలోగా చుట్టు పక్కల ఉన్న వారంతా అక్కడ గుమికూడతారు. వారిలో ఓ మహిళ (woman) సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తుంది. వెంటనే పిల్లాడి కడుపుపై చేతులు పెట్టి పైకి ఎత్తుకుని గట్టిగా నొక్కుతుంది.
Viral Video: సైకిల్‌పై వెళ్తున్న బాలిక చున్నీని ఆకతాయి లాగడంతో.. అంతా చూస్తుండగానే సడన్‌గా..
ఇలా పదే పదే చేయడం వల్ల.. గొంతులో ఇరుక్కున్న చాక్లెట్ బయటికి వస్తుంది. ప్రాణాపాయం తప్పడంతో పిల్లాడి తల్లిదండ్రులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. తన కొడుకును కాపాడిన మహిళను.. తల్లి కౌగిలించుకుని ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సమయానికి దేవతలా వచ్చి కాపాడింది’’.. అని కొందరు, ‘‘సమయానికి ఈమె రాకుంటే.. వామ్మో! తలుచుకుంటేనే భయంగా ఉంది’’.. అని మరికొందరు, ‘‘పిల్లాడికి పునర్జన్మను ప్రాసాదించింది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 1.50లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.