Viral Video: తెలిసి చేసిందా... తెలీక చేసిందా... బైకుపై కూర్చున్న ఈ మహిళను చూసి నవ్వుకుంటున్న నెటిజనం..

ABN , First Publish Date - 2023-09-17T15:16:11+05:30 IST

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నా.. చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఎదుట నిబంధనలు పాటిస్తున్నట్లు నటించి.. వారు అటు వెళ్లగానే షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరైతే..

Viral Video: తెలిసి చేసిందా... తెలీక చేసిందా... బైకుపై కూర్చున్న ఈ మహిళను చూసి నవ్వుకుంటున్న నెటిజనం..

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నా.. చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఎదుట నిబంధనలు పాటిస్తున్నట్లు నటించి.. వారు అటు వెళ్లగానే షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరైతే హెల్మెట్ ఉన్నా కేవలం తలకు ధరించకుండా కేవలం అలంకారప్రాయంగా బైక్‌కు తగిలించడం చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ హెల్మెట్ ధరించిన తీరు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె తెలిసి చేసిందా.. లేక తెలీక చేసిందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని రోడ్డు పైకి వస్తాడు. వస్తూ వస్తూ ఇద్దరూ తలకు హెల్మెట్లు (Helmets) ధరించి వస్తారు. వారు నిబంధనలు పాటించారు కదా.. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని మీకు సందేహం రావచ్చు. ఆమె హెల్మెట్ ధరించిన మాట వాస్తవమే కానీ.. ధరించిన తీరే ప్రస్తుతం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. అందరిలా కాకుండా ఆమె హెల్మెట్‌ను (woman wearing a helmet upside down) తల కిందులుగా ధరించడం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.

Viral Video: సైకిల్‌పై వెళ్తున్న బాలిక చున్నీని ఆకతాయి లాగడంతో.. అంతా చూస్తుండగానే సడన్‌గా..

వెనుక భాగాన్ని ముందుకు వచ్చేలా ధరించిన తీరు.. చూడటానికి నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఇది చూడటానికి బాగానే ఉన్నా ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి సేఫ్లీ ఉండదంటూ అంతా హెచ్చరిస్తున్నారు. ఈమెను దూరం నుంచి గమనించిన ఓ వ్యక్తి.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎదరుగా పోలీసులు ఉన్నారేమో.. అందుకే తప్పక ఇలా కానిచ్చేసింది’’.. అంటూ కొందరు, ‘‘అరే! హెల్మెట్‌ను ఇలాక్కూడా పెట్టుకోవచ్చా’’.. అని మరికొందరు, ‘ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందమ్మా.. ‘నీకు దండం తల్లో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి కారును ఇండియాలో మాత్రమే చూడగలం.. ఇంతకీ ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవడం ఖాయం..

Updated Date - 2023-09-17T15:16:11+05:30 IST