Viral Video: ఫ్రాంక్ వీడియోలు చేసే యూట్యూబర్.. ఇలా చేశాడేంటి..? చొక్కావిప్పి.. ఓ ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకుని..!
ABN , First Publish Date - 2023-09-15T20:26:16+05:30 IST
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ లైక్‌లు, వ్యూస్ కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటే.. మరికొందరరు ప్రాంక్‌ల పేరుతో పబ్లిక్‌లో వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫేమస్ అయ్యేందుకు ఇంకొందరు...
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ లైక్‌లు, వ్యూస్ కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటే.. మరికొందరరు ప్రాంక్‌ల పేరుతో పబ్లిక్‌లో వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫేమస్ అయ్యేందుకు ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఎవరూ ఊహించని సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబర్.. ఫ్యాషన్ షోలో చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఉన్నట్టుండి స్టేజి మీదకు వచ్చిన అతన్ని చూసి అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. న్యూయార్క్ (New York) ఫ్యాషన్ వీక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్రెడ్ బేయర్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో (Youtube) ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఇదిలావుండగా, ఫ్యాషన్ షో వద్దకు వచ్చిన అతను.. విచిత్ర వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నాడు. షార్ట్ వేసుకుని, ఒంటిపై కేవలం ఓ ప్లాస్టిక్ కవర్‌ను చొక్కా తరహాలో ధరించాడు. అలాగే టోపీకూడా ధరించి చిత్రవిచిత్రంగా రెడీ అయ్యాడు. ఫ్యాషన్ షో (Fashion show) జరుగుతున్న క్రమంలో మధ్యలో లోపలికి ఎంటర్ అయ్యాడు.
దీంతో అక్కడున్న యువుతులంతా తెగ నవ్వుకున్నారు. అంతా చూస్తుండగానే వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చాడు. అయితే అటు నుంచి ఇటువైపు నడుచుకుంటూ రాగానే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫేం కోసం ఇదంతా కావాలనే చేశారు’’.. అని కొందరు, ‘‘ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్’’.. అని మరికొందరు, ‘‘డ్రస్సు చాలా వెరైటీగా ఉంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.