ఫైనల్లో సింధు

ABN , First Publish Date - 2023-04-02T01:40:17+05:30 IST

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ సీజన్‌లో తొలిసారిగా ఒక టోర్నీలో ఫైనల్‌ చేరింది. మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది.

ఫైనల్లో సింధు

మాడ్రిడ్‌ (స్పెయిన్‌): స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ సీజన్‌లో తొలిసారిగా ఒక టోర్నీలో ఫైనల్‌ చేరింది. మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో రెండోసీడ్‌ సింధు 24-22, 22-20తో యో జియా మిన్‌ (సింగపూర్‌)పై నెగ్గింది. గ్రిగోరియా టన్‌జుంగ్‌ (ఇండోనేసియా)తో సింధు ఫైనల్‌ ఆడనుంది. గతేడాది కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన తర్వాత సింధు ఒక టోర్నీలో ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

Updated Date - 2023-04-02T01:40:17+05:30 IST