Virat Kohli: గంభీర్‌పై రివేంజ్ తీర్చుకున్న విరాట్ కోహ్లీ.. మైదానంలో కోహ్లీ ప్రవర్తన చూడండి..!
ABN , First Publish Date - 2023-05-02T11:40:30+05:30 IST
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేస్తున్నప్పుడే కాదు.. మైదానంలోనూ చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడు. తననెవరైనా కవ్విస్తే వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేస్తున్నప్పుడే కాదు.. మైదానంలోనూ చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడు. తననెవరైనా కవ్విస్తే వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఈ సీజన్‌లో కొన్ని రోజుల క్రితం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో (LSG) జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి, గంభీర్‌కు (Kohli Fight With Gambhir) మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఈ క్రికెటర్లిద్దరి మధ్య ఎప్పట్నుంచో విభేదాలున్నాయి. అవి ఈ ఐపీఎల్‌లో (IPL 2023) మరింత పెరుగుతున్నాయి.
ఈ లీగ్ తొలి రౌండ్‌లో లఖ్‌నవూ, బెంగళూరు (LSGvsRCB) తలపడినపుడు చివరి ఓవర్లో లఖ్‌నవూ విజయం సాధించింది. విజయం సాధించిన వెంటనే లఖ్‌నవూ మెంటార్ గంభీర్ (Gautam Gambhir) కాస్త అతిగా ప్రవర్తించాడు. షేక్‌హ్యాండ్ సమయంలో కోహ్లీతో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. అలాగే మైదానంలోకి వచ్చి బెంగళూరు అభిమానులను నోర్మూసుకోవాలంటూ నోటిపై వేలు పెట్టి అభినయించాడు. అప్పట్లో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral)అయ్యాయి. తాజాగా మరోసారి సోమవారం రాత్రి లఖ్‌నవూ, బెంగళూరు టీమ్‌ల మధ్య మ్యాచ్ జరిగింది.
IPL 2023: మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లకు మొక్కిన ఫ్యాన్.. కోహ్లీ ఎలా స్పందించాడో చూడండి..
లఖ్‌నవూలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ పగ తీర్చుకున్నాడు. గంభీర్‌లాగానే కోహ్లీ కూడా నోటిపై వేలు పెట్టి ప్రేక్షకులకు చూపించాడు. అలాగే లఖ్‌నవూ వికెట్లు పడుతున్నప్పుడు అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం లఖ్‌నవూ బౌలర్ నవీనుల్ హక్, గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ (BCCI) కోహ్లీ, గంభీర్‌లకు 100 శాతం మ్యాచ్ ఫీజ్ కట్ చేసింది. అలాగే ఈ గొడవకు పరోక్షంగా కారణమైన నవీనుల్ హక్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా (Fine) విధించింది.