టెలిగ్రామ్‌లో...
ABN , First Publish Date - 2023-04-29T00:51:09+05:30 IST
వాట్సాప్ ప్రత్యర్థి టెలిగ్రామ్ కూడా సరికొత్త ఫీచర్లను తన యూజర్లకు విడుదల చేసింది.

వాట్సాప్ ప్రత్యర్థి టెలిగ్రామ్ కూడా సరికొత్త ఫీచర్లను తన యూజర్లకు విడుదల చేసింది. సరికొత్త అప్డేట్‌తో షేరబుల్ చాట్ ఫోల్డర్లు, వాల్‌పేపర్లు సహా పలు ఫీచర్లు ఉన్నాయి.
కొత్త అప్డేట్ ఫలితంగా చాట్ ఫోల్డర్లను షేర్ చేసుకోవచ్చు. దీంతో మల్టిపుల్ గ్రూప్ అలాగే న్యూస్ చానల్స్‌కి స్నేహితులను రప్పించుకోవచ్చు. వేర్వేరుగా ఇన్వైట్ లింక్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్మిన్‌లకు చేర్చుకునే అధికారం ఉన్న పబ్లిక్ చాట్స్ వేటినైనా యూజర్లు కలుపుకోవచ్చు.
ఫ వేర్వేరు చాట్స్ కోసం కస్టమ్ వాల్‌పేపర్స్‌ని సెట్ చేసుకోవచ్చు. ఫొటోలు, కలర్ థీమ్స్‌ని జతచేసుకోవచ్చు. వాల్ పేపర్ సెట్ అయిన తరవాత స్పెషల్ మెసేజ్ అందుతుంది. అలా చాట్ పార్టనర్ కూడా తనవైపు అదే వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. అది వద్దనుకుంటే పార్టనర్ కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు.
టెలిగ్రామ్ బాట్స్(స్పెషల్ అప్లికేషన్స్) వెబ్ యాప్స్‌ను స్వీకరించగలుగుతాయి. డైరెక్ట్ లింక్ లేదంటే టెలిగ్రామ్‌లోని ఏదైనా చాట్ నుంచి బాట్స్ యూజర్ నేమ్ ఉపయోగించి యాక్సెస్ పొదవచ్చు. గ్రూప్స్‌లో వీటిని మొదలుపెడితే సదరు కొలాబిరేషన్‌కు వీటి సపోర్టు ఉంటుంది. మెంబర్లకూ ఆ ఫీచర్లు అందుతాయి.
యూజర్ నేమ్స్‌ని ఈ బోట్స్ సేకరించగలుగుతాయి. టెలిగ్రామ్ ప్రీమియమ్‌ను సొంతం కోసం కొనుగోలు చేయవచ్చు. మరొకరికి బహుమతిగానూ ఇవ్వవచ్చు. ఫ్రాగ్‌మెంట్ ద్వారా ఈ పని చేయవచ్చు.
షేర్డ్ మీడియా మాదిరిగా అటాచ్‌మెంట్స్‌ను కూడా తీసుకువచ్చింది. డేట్ బార్ దగ్గరికి తీసుకురాగలిగితే చాలు.
ఫ వందకు తక్కువగా ఉన్న గ్రూపుల్లో పెట్టిన మెసేజ్‌లను ఇతర సభ్యులు ఏ సమయంలో చదివారో లేదంటే చూశారో తెలుసుకోవచ్చు.
యూజర్ ఇంటర్‌ఫేస్‌కు కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ జరిగాయి. తక్కువ టాప్స్‌తో ఆన్‌లైన్ ఫీచర్లను పంపుకోవచ్చు. మెంబర్లతో నిమిత్తం లేకుండా గ్రూపులను ఆరంభించవచ్చు. అనుమతుల నిబంధనలు తదితరాలను అప్పుడు పెట్టుకోవచ్చు.