సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వం
ABN , First Publish Date - 2023-09-17T00:50:25+05:30 IST
భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ సంపద అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు మూడావత రవినాయక్ అ న్నారు.

సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వం
వేములపల్లి, మిర్యాలగూడ, సెప్టెంబరు 16: భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ సంపద అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు మూడావత రవినాయక్ అ న్నారు. శనివారం వేములపల్లి మండలంలోని రావులపెంట, మిర్యాలగూడలో నిర్వహించిన కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో రావులపెంటలో అమరు ల స్తూపానికి పూలమాలలు వేసి నాటి సాయుధ పోరాటంలో పా ల్గొన్న వారి కుటుంబసభ్యులను సన్మానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి క మ్యూనిస్టులపై చులకన భావం ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణ సా యుధ పోరాట సమయంలో రావులపెంట గ్రామానికి ఘనమైన చరిత్ర ఉందని, ఎందరో సాయుధ పోరాట యోధులను అప్పగించిందని కొనియాడారు. తెలంగాణ పోరాట చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటం ఒక మైలు రాయిగా నిలిచిందని, నాటి పోరాటంలో సుమా రు 4వేల మంది నేలకొరిగి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించారన్నారు. రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదేన్నారు. నేటి ప్ర భుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలాయన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోమారు ప్రజలను మోసగించేందుకు సిద్ధమవుతున్నాయ ని అన్నారు. పట్టణంలోని అనుదితి ఫంక్షనహల్‌లో ఆదివారం నిర్వహించన్ను సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ యా కార్యక్రమాల్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్ధని, మాడ్గులపల్లి మండల కార్యదర్శి రొం డి శ్రీనివాస్, రైతుసంఘం నాయకులు పాల్వాయి రాంరెడ్డి, ఐద్వా నాయకురాలు పోలెబోయిన వరలక్ష్మి, కందుల నాగిరెడ్డి, రెమడాల భిక్షం, ధర్మయ్య, వల్లమల్ల ఎల్లయ్య, శీలం కలమ్మ, వెంకన్న, శ్రీను, సంపత, అప్పారావు, వెంకట్‌రెడ్డి, మహ్మద్‌బాషా పాల్గొన్నారు.