Online Ticketing: సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానం
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:23 PM
సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. చిల్లర సమస్యకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సిటీ ఆర్టీసీ బస్సుల్లో (City RTC Buses) ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని (Online Ticketing System) అందుబాటులోకి తీసుకువచ్చింది. యూపీఐ చెల్లింపుల (UPI payment) విధానంతో టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని (Greater Hyderabad) మొత్తం 2,200 బస్సుల్లో క్యూఆర్ కోడ్ (QR code) ద్వారా టికెటింగ్ విధానం మొదలు పెట్టింది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టింది.
Read More:
యూపీఐ చెల్లింపులు జీవితంలో ముఖ్య భాగం అయిపోయాయి. షాపింగ్‌కు వెళ్లినా.. చిన్న చిన్న కిరాణా దుకాణాలకు వెళ్లినా వస్తువలు కొనుగోలు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నాం. అదే విధంగా ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేస్తున్నాం. భారతదేశాన్ని ‘న్యూ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’గా మార్చడానికి ఇది చాలా ముఖ్యమైన సాధనమని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపు విధానానికి అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిల్లర సమస్యకు చెక్ పెడుతూ.. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ప్రవేశపెట్టింది.
సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. చిల్లర సమస్యకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆర్టీసీ ఆన్ లైన్ టికెటింగ్ తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకీ తీసుకొస్తామని టీజీఎస్ ఆర్‌టీసీ ప్రకటించింది. సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రయాణం చేయవచ్చునని టీజీఆర్టీసీ ప్రకటించింది.
కాగా.. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దుర్గగుడిలో 8 కీలక ఫైళ్ళు గల్లంతు..
ఆశా వర్కర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
డీఐజీ సునీల్ నాయక్‌కు నోటీసులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News