Share News

AP CM: మహిళలకు ఏపీ సీఎం శుభవార్త..

ABN , Publish Date - Mar 02 , 2025 | 05:58 PM

మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.

AP CM: మహిళలకు ఏపీ సీఎం శుభవార్త..
AP CM Chandrababu Naidu

మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బడ్జెట్‌లో తల్లికి వందనం పథకం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే.


కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా.. ప్రతీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికీ సంవత్సరానికి రూ.15,000 చొప్పున ఇస్తాం అని చెప్పింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ నగదు ఇస్తాం అని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఈ మేరకు మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నగదను జమ చేయనున్నారు.

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 02 , 2025 | 06:19 PM