Share News

CEO Vikasraj : తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు

ABN , First Publish Date - 2023-12-01T14:57:00+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో 70.74 శాతం పోలింగ్‌ ( Polling ) అయిందని సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గతం కంటే 3 శాతం పోలింగ్‌ తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 పోలింగ్‌ శాతం నమోదయిందని చెప్పారు. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గిందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు.

CEO Vikasraj : తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో 70.74 శాతం పోలింగ్‌ ( Polling ) అయిందని సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గతం కంటే 3 శాతం పోలింగ్‌ తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 పోలింగ్‌ శాతం నమోదయిందని చెప్పారు. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గిందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుదన్నారు. రాష్ట్రంలో రీ పోలింగ్‌కు అవకాశం లేదని సీఈఓ వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. 3కోట్ల 26లక్షల ఓట్లు కాగా పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. దేవరకద్రలో 10మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల (EVM)ల మార్పిడి జరిగిందన్నారు. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలిచామని అన్నారు.పోలింగ్‌పై స్క్రూటినీ ఈరోజు ఉదయం నుంచి జరుగుతుందన్నాని సీఈఓ వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయిందన్నారు. లెక్కింపు జరిగిన కూడా మళ్లీ రెండు సార్లు ఈవీఎంల (EVM)లను లెక్కిస్తారన్నారు. ప్రతీ రౌండ్‌కు సమయం పడుతుందని.. ECI నిబంధనల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని.. 8.30 నిమిషాల నుంచి ఈవీఎంల (EVM)ల లెక్కింపు ఉంటుందన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలున్నాయని.. హైదరాబాద్‌లో 14 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి టేబుల్‌కి ఐదుగురు అధికారులు ఉంటారని.. కౌంటింగ్‌కు అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని సీఈఓ వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-01T14:57:01+05:30 IST