Share News

Revanth Government Live Updates: హాట్ హాట్‌గా తొలి కేబినెట్ సమావేశం

ABN , First Publish Date - 2023-12-07T12:25:18+05:30 IST

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటి తర్వాత ఆయన సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి చేరుకున్నారు. ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది.

Revanth Government Live Updates: హాట్ హాట్‌గా తొలి కేబినెట్ సమావేశం

Live News & Update

  • 2023-12-07T22:10:47+05:30

    రేపు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

    - విద్యుత్ అంశంలో అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

    - కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేశారన్న రేవంత్

    - విద్యుత్‌లో 85 వేల కోట్ల రూపాయల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వం

    - సోమవారం నుంచి విద్యుత్ పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెగబడ్డ కేసీఆర్

    - విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి వివరాలతో రావాలని అధికారులకు ఆదేశం

    - సీఎండీల రాజీనామాలు ఆమోదించవద్దని అధికారులకు ఆదేశం

    - రేపటి రివ్యూ మీటింగ్‌కు అందరు రావాలని ఆదేశాలు

  • 2023-12-07T21:20:03+05:30

    ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు

    ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు.

  • 2023-12-07T21:15:09+05:30

    హాట్ హాట్‌గా తొలి కేబినెట్ సమావేశం

    - హాట్ హాట్‌గా సాగిన తొలి క్యాబినెట్ సమావేశం

    - విద్యుత్‌పై సీరియస్‌గా సాగిన రివ్యూ

    - విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

    - విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్

    - విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ సీఎం

    - రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశం

    - రేపు ఉదయం విద్యుత్‌పై సీఎం ప్రత్యేక సమీక్ష

    - విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు చెప్పిన అధికారులు

    - సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

    - రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు ఆదేశం

  • 2023-12-07T19:02:22+05:30

    ముగిసిన కేబినెట్ భేటీ

    సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖ‌ల కార్యద‌ర్శులు హాజ‌ర‌య్యారు. కాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

  • 2023-12-07T17:55:38+05:30

    ఆరో అంతస్థులో రేవంత్ రెడ్డి ఛాంబర్

    తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కోసం అధికారులు ప్రత్యేక ఛాంబర్‌ను సిద్ధం చేశారు. ఆరో అంతస్థులో సీఎం ఛాంబర్ ముందు నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    revanth reddy name board.jpg

  • 2023-12-07T17:40:00+05:30

    సీఎం రేవంత్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

    తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్‌తో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని.. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన రాజకీయ నేతగా ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరారని పవన్ అభినందించారు.

  • 2023-12-07T17:17:19+05:30

    సీఎం రేవంత్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

    తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

  • 2023-12-07T17:03:54+05:30

    తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం

    తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఆరు గ్యారంటీల అమలుపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

  • 2023-12-07T16:50:46+05:30

    సీఎం రేవంత్‌కు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు

    తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని ఆకాంక్షించారు.

  • 2023-12-07T16:26:46+05:30

    సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, పోలీసులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

    Secratariat Revanth Reddy.jpeg

  • 2023-12-07T15:50:01+05:30

    రేవంత్‌కు హరీష్‌రావు శుభాకాంక్షలు

    రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్‌రావు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని హరీష్‌రావు ఆకాంక్షించారు.

  • 2023-12-07T15:45:35+05:30

    సీఎం రేవంత్‌కు మెగాస్టార్ శుభాకాంక్షలు

    తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 2023-12-07T15:35:26+05:30

    సా.5 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

    తెలంగాణ సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది.

  • 2023-12-07T15:15:29+05:30

    సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం

    సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి.. ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా శివధర్‌రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

    sivadhar reddy.jpg

  • 2023-12-07T15:10:00+05:30

    మంత్రులకు శాఖలు ఖరారు

    ఉత్తమ్-హోంశాఖ

    దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ

    భట్టి విక్రమార్క- రెవెన్యూ

    కోమటిరెడ్డి-మున్సిపల్

    తుమ్మల-రోడ్డు, భవనాల శాఖ

    పొంగులేటి-ఇరిగేషన్

    శ్రీధర్‌బాబు-ఆర్ధిక శాఖ

    సీతక్క-గిరిజన సంక్షేమ శాఖ

    జూపల్లి-సివిల్ సప్లై

    పొన్నం-బీసీ సంక్షేమశాఖ

    కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

  • 2023-12-07T15:02:59+05:30

    సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

    తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 2023-12-06T14:52:00+05:30

    రెండో సంతకం పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి

    దివ్యాంగురాలు రజినీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం పెట్టారు.

  • 2023-12-07T14:30:50+05:30

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబాన్ని సోనియా గాంధీతోపాటు ఇతర అగ్రనేతలకు పరిచయం చేశారు. భార్య గీత, కూతురు-అల్లుడు జంటను పరిచయం చేశారు.

  • 2023-12-07T14:15:58+05:30

    ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. రెండవ సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామకం పత్రంపై చేశారు.

  • 2023-12-07T14:12:51+05:30

    ‘‘దశాబ్దకాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనై, మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్దకాలం మౌనంగా భరించిన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనలను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలను చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ప్రజారాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

    Untitled-16.jpg

  • 2023-12-07T14:02:50+05:30

    జై సోనియమ్మ.. జైజై సోనియమ్మ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రం త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి రాష్ట్రంలోని 4 కోట్ల మంది జనాలకు స్వేచ్ఛ ఇవ్వాలని సామాజిక న్యాయం చేయాలని అసిఫాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలుపెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’’ అని ప్రసంగించారు.

  • 2023-12-07T13:55:15+05:30

    ప్రమాణస్వీకారం చేసిన నేతలు వీరే..

    1. రేవంత్ రెడ్డి (సీఎం)

    2. మల్లు భట్టి విక్రమార్క (డిప్యూటీ సీఎం)

    3. ఉత్తమ్ కుమార్ రెడ్డి (మంత్రి)

    4. దమోదరరాజ నర్సింహ (మంత్రి)

    5. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (మంత్రి)

    6. దుద్దిళ్ల శ్రీధర్ బాబు (మంత్రి)

    7. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (మంత్రి)

    8. పొన్నం ప్రభాకర్ (మంత్రి)

    9. కొండా సురేఖ (మంత్రి)

    10. సీతక్క (మంత్రి)

    11. తుమ్మల నాగేశ్వరరావు (మంత్రి)

    12. జూపల్లి కృష్టారావు (మంత్రి)

    మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారికి శాఖలు కేటాయించాల్సి ఉంది.

  • 2023-12-07T13:40:01+05:30

    రాష్ట్రమంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క ప్రమాణస్వీకారం చేశారు.

  • 2023-12-07T13:35:56+05:30

    డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భట్టి విక్రమార్క

  • 2023-12-07T13:30:03+05:30

    సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ఇదే..

    ‘‘ ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచను లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణస్వీకార పత్రంపై సంతకం చేశారు.

    Untitled-15.jpg

  • 2023-12-07T13:26:43+05:30

    డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు.

  • 2023-12-07T13:22:34+05:30

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయించారు. దీంతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను ఆయన స్వీకరించారు.

  • 2023-12-07T13:16:19+05:30

    articleText

  • 2023-12-07T13:12:56+05:30

    కోలాహలంగా మారిన ఎల్బీ స్టేడియం. వేదికపై ఆశీనులైన కాంగ్రెస్ అగ్రనేతలు. మరికొన్ని క్షణాల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. వేదిక వద్దకు చేరుకున్న గవర్నర్ తమిళిసై వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానం పలికారు.

  • 2023-12-07T13:10:40+05:30

    వేదికపై ఆశీనులైన కాంగ్రెస్ అగ్రనేతలు...

    Untitled-12.jpg

  • 2023-12-07T13:02:36+05:30

    రాజ్‌భవన్ నుంచి బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

  • 2023-12-07T12:57:04+05:30

    ఎల్బీ స్టేడియం చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి.

  • 2023-12-07T12:46:46+05:30

    రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిథులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఏఐసీసీ అగ్రనేతలంతా ఎల్బీ స్టేడియానికి చేరకున్నారు. రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. ఒకే వాహనంలో ఏడుగురు అగ్రనేతలు చేరుకుంటున్నారు.

  • 2023-12-07T12:38:49+05:30

    తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్...

    తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. వికారాబాద్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మర్పల్లిలో ఆయన పుట్టారు. ఇంటర్మీడియట్ చదివారు. పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్‌ నియోజకవర్గ నుంచి గెలిచారు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా తొలిసారి 2009లో ఎన్నికయ్యారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుస ఓటములను చవిచూశారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మంచి అనుభవం ఉండడంతో ఆయనకు స్పీకర్ బాధ్యతలు అప్పగించింది.

    Untitled-8.jpg

  • 2023-12-07T12:29:31+05:30

    రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ మంత్రుల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజ్‌భవన్‌కు అందజేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తెలంగాణకు ఒకే ఒక ఉపముఖ్యమంత్రి ఉండనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.

    మంత్రుల జాబితా ఇదే..

    1. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

    2. కొండా సురేఖ

    3. జూపల్లి కృష్ణ రావు

    4. భట్టి విక్రమార్క

    5. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

    6. పొన్నం ప్రభాకర్

    7. సీతక్క

    8. శ్రీధర్ బాబు

    9. తుమ్మల నాగేశ్వరరావు

    10. పొంగులేటి శ్రీనివాసరెడ్డి

    11. దామోదర రాజనర్సింహ

  • 2023-12-07T12:23:08+05:30

    Telangana CM Oath Ceremony Live Updates: తెలంగాణ సీఎంగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అనుముల రేవంత్‌రెడ్డి.. రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరిది! రాజకీయ అరంగేట్రంలోనే సంచలనాలు! నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. స్వతంత్రంగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి, కేవలం 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. తొలుత టీఆర్‌ఎ్‌స(ప్రస్తుతం బీఆర్‌ఎ్‌స)లో పనిచేసిన రేవంత్‌.. తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పార్టీ సర్కారునే గద్దె దించి, ఏకంగా సీఎం అయిపోయారు. మరికొద్ది సేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు.