ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-12-12T17:46:02+05:30

బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ( BJP ) పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) కి కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత, చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ( BJP ) పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) కి కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత, చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు కుట్ర పన్ని ఒకరకమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే డీజీపీకి ఫిర్యాదు చేశాం. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కుట్రలకు తెరలేపారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కులగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ రవిగుప్తాకు వినతిపత్రం ఇచ్చాం. సమగ్రంగా అధ్యయనం చేయాలని డీజీపీని కోరాం. ప్రజలందరూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల వ్యాఖ్యలను గమనిస్తున్నారు’’ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Updated Date - 2023-12-12T17:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising