Share News

TS Election : పోలింగ్ ముందు షాకింగ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ!

ABN , First Publish Date - 2023-11-29T19:35:01+05:30 IST

Telangana Elections 2023 : తెలంగాణలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు (TS Assembly Polls) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డాయి. ఓటింగ్‌పై (Voting) ఎవరి అంచనాల్లో వాళ్లున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని రీతిలో వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది...

TS Election : పోలింగ్ ముందు షాకింగ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ!

తెలంగాణలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు (TS Assembly Polls) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డాయి. ఓటింగ్‌పై (Voting) ఎవరి అంచనాల్లో వాళ్లున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని రీతిలో వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తాజా సమాచారంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. వర్షం పడి.. పోలింగ్ సరిగ్గా జరగపోతే పరిస్థితి ఏంటి..? ఏం నష్టం జరుగుతుందోనని పార్టీలు భయాందోళన చెందుతున్నాయి.


ఎక్కడెక్కడ..?

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం వాయు గుండంగా బలపడనున్నట్లు వివరించింది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో భారీగా వానలు పడతాయని కూడా అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2023-11-29T19:35:34+05:30 IST