Share News

Allahabad High Court : అరెస్టుకు కారణం చెప్పకుంటే బెయిల్‌ ఇవ్వొచ్చు

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:41 AM

అరెస్టు సమయంలో నిందితుడికి కారణాలు చెప్పకపోతే బెయిల్‌ మంజూరు చేయవచ్చని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1) ప్రకారం కారణాలు చెప్పడం తప్పనిసరి అని పేర్కొంది

Allahabad High Court : అరెస్టుకు కారణం చెప్పకుంటే బెయిల్‌ ఇవ్వొచ్చు

ప్రయాగ్‌రాజ్‌, ఏప్రిల్‌ 12: అరెస్టుకు పోలీసులు కారణాలు చెప్పకుంటే నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయవచ్చని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి కారణాలు చెప్పలేదన్న విషయాన్ని ప్రాతిపదికగా చూపించి బెయిల్‌ ఇవ్వవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1) ప్రకారం అరెస్టు చేసే ముందు నిందితుడికి కారణాలు చెప్పడం తప్పనిసరి అని పేర్కొంది. మంజీత్‌ సింగ్‌ అనే నిందితుడిని రిమాండుకు పంపిస్తూ రాంపూర్‌ మేజిస్ట్రేటు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మోసం తదితర ఆరోపణలతో మంజీత్‌సింగ్‌పై గత ఏడాది ఫిబ్రవరి 15న కేసు నమోదయింది. పోలీసులు అతడిని డిసెంబరు 25న అరెస్టు చేసి మరుసటి రోజున కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేటు రిమాండుకు పంపారు. దీనిపై అతడు హైకోర్టులో అప్పీలు చేశాడు. అరెస్టు సందర్భంగా తనకు ఎలాంటి కారణాలు చెప్పలేదని పేర్కొన్నాడు. దీంతో, మంజీత్‌సింగ్‌ అరెస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

Updated Date - Apr 13 , 2025 | 03:43 AM